రజనీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్..

కోలివుడ్ థ‌లైవార్ రజనీకాంత్ తాజాగా కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్షన్ పరంగా రికార్డ్‌ల‌ వర్షం కురిపిస్తున్నాడు. రజిని ఏడుపదుల వయసులోనూ తన స్టైలిష్‌ పెర్ఫార్మన్స్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ టాలీవుడ్‌లోను మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని.. కథ చర్చలు కూడా ప్రారంభమయ్యాయి అంటూ టాక్‌ వైరల్‌గా మారుతుంది.

Exclusive: Rajinikanth and Nag Ashwin Film on Cards - Telugu360

దీనిపై అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన లేకపోయినా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు కదా.. తనే నాగ అశ్విన్. క‌ల్కి 2898 ఏడితో చివరిగా బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన ఆయన.. ఈ సినిమాకు సీక్వెల్ గా మరో ప్రాజెక్ట్ పనిలో బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో.. కల్కి సీక్వెల్‌కు ప్రత్యామ్నాయంగా మరో సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడని.. ప్రభాస్ చేయాల్సిన సినిమాస్ లిస్ట్ భారీగా ఉండడంతో మరో కథను బయటకు తీసినట్లు సమాచారం.

Crazy Buzz: Nag Ashwin to direct star hero's son

ఈ సినిమా కోసం రజనీకాంత్‌ను హీరోగా భావిస్తున్నాడట. ఒకవేళ ఇదే వాస్తవమై.. నాగ అశ్విన్‌.. రజినీతో సినిమా చేస్తే మాత్రం ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్‌లో హైప్ నెల‌కొంటుంది. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ లోనే కాదు.. కోలీవుడ్ లోనూ ఈ సినిమాపై బ‌జ్‌ మొదలవుతుంది. ఇక చివరిగా నాగ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడి సినిమాలో.. కమల్ హాసన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు రజనీతో సినిమా సైన్ చేస్తే మాత్రం వరుసగా కమల్ రజనీలతో సినిమాలు చేసిన ఘనత కూడా దక్కుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.