ఇటీవల టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు.. జయంబు నిశ్చయంబురా.. అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టాక్ షోలో తాజాగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. శ్రీ లీల సందడి చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి కాల్ షీట్లు అడిగితే.. ముందు ఎవరికి కాల్ షీట్లు ఇస్తావు అనే ప్రశ్న.. శ్రీలీలను జగపతిబాబు ప్రశ్నించగా.. దానికి శ్రీలీల.. ఎప్పటిలాగే చాలా తెలివిగా స్టైలిష్ గడసరి సమాధానాన్ని ఇచ్చింది. ఇద్దరి కోసం రెండు షిఫ్ట్‌లుగా పని చేస్తా అంటూ ఆమె వివరించింది.
ఇక నువ్వు ఇప్పటికే కలిసి నటించిన మహేష్, రవితేజలో ఎవరు.. ఎక్కువగా అల్లరి చేస్తారని ప్రశ్నకు రవితేజ అంటూ కామెంట్ చేసింది. పెళ్లి సందడి మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.. అతితక్కువ సమయంలోనే.. ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, రాబిన్‌హుడ్, జూనియర్ లాంటి సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
అంతేకాదు.. పాన్ ఇండియన్ సాలిడ్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 మూవీ కిసిక్ స్పెషల్ సాంగ్‌తో ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. చివరిగా రిలీజ్ అయిన జూనియర్లో వైరల్ వయ్యారి సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ట్రైండ్ సెట్ చేసింది. రవితేజ సరసన మాస్ జాతరతో త్వరలో ఆడియన్స్‌ను పలకరించనుంది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సైతం శ్రీ లీల హీరోయిన్గా మెరవనుంది.