ప్రస్తుతం త్రో బ్యాక్ థీం నెటింట తెగ వైరల్‌గా మారుతున్న క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. అలా ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా దూసుకుపోతున్నారు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలను గుర్తుపట్టారా.. వీళ్ళిద్దరు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలి నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారే. ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళలో ఒకరు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన స్టార్ డైరెక్టర్ కూతురు కాగా.. మరొకరు స్టార్ నటి కుమార్తె. ఇద్దరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఓ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.
సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తమకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మలని.. ఇప్పటికైనా గుర్తుపట్టారా. సర్లేండి మేమే చెప్పేస్తాం. వాళ్లలో ఒకరు మహానటి కీర్తి సురేష్ కాగా.. మరొకరు హలో మూవీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శి. వీళ్లిద్దరు సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడంతో.. చిన్నప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కీర్తి , కళ్యాణి ఇద్దరు ఇప్పటికీ తమ ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తరచు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిస్సీల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. ఇక ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం కాకముందే.. విక్రమ్.. ఇరుముగా, హృతిక్ రోషన్.. క్రిష్ 3 లాంటి సినిమాలకు ఆర్ డైరెక్టర్‌గా.. అసిస్టెంట్గా వ్యవహరించింది.
2017లో హాల్లో సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా పరిచయం అయింది. ఈ సినిమాకు అక్కినేని అఖిల్ హీరోగా మెరిశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కళ్యాణి అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే.. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో క్రేజ్‌రాకపోవడంతో.. టాలీవుడ్ అవకాశాలు దూరమయ్యాయి. ప్రస్తుతం మలయాళంలో కళ్యాణి హీరోయిన్గా రాణిస్తుంది. ఇక కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో తెలుగులోను హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అటూ ప్రొఫెషనల్ పరంగా, ఇటు కెరీర్ పరంగాను ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది కీర్తి. ఇక త్వరలోనే రివాల్వర్ రీటాగా ఆడియన్స్‌ను పలకరించనుంది.