చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 70వ‌ పుట్టిన రోజును తాజాగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు చిరు. తన అందం, ఫిట్నెస్ తోను కుర్ర‌కారును ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శివ‌శంకర్ వరప్రసాద్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్‌ చిరు బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక దీంతోపాటే.. చిరు నుంచి రిలీజ్ కు సిద్ధమవుతున్న మరో మూవీ విశ్వంభ‌ర‌. మల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. సెకండ్ హాఫ్ గ్రాఫిక్ వర్క్స్ కారణంగా ఇప్పటివరకు రిలీజ్ కాకుండా ఆలస్యం అవుతూ వ‌స్తుంది.

Bobby, Chiranjeevi Join Hands – What's Cooking Now? | Bobby, Chiranjeevi  Join Hands – What's Cooking Now?

ఇప్పుడు మరింత సమయం తీసుకుని వచ్చేయేడాది సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. ఈ రెండు సినిమాలు కాకుండా.. స్టార్ట్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్‌లోను చిరు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో.. బాబి, చిరు కాంబోలో వాల్తేరు వీరయ్య తెర‌కెక్కి.. కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే.. చిరుతో మరోసారి బాబీ సినిమా ఛాన్స్ కొట్టేసాడు. చిరుని ఎలా చూపిస్తే ఆడియన్స్ కు నచ్చుతుందో అలా చూపించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు మెగాస్టార్ ను ఎవరు చూడని కొత్త కోణంలో చూపించే ప్రయత్నాలు చేయనున్నాడని టాక్‌.

Anirudh Ravichander

అయితే.. ఈ సినిమాకు మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్‌ని భావించారట. కానీ.. అనిరుధ్‌ డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంతో నో చెప్పేసినట్లు తెలుస్తుంది. దీంతో థ‌మన్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న అనిరుధ్‌ ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం కష్టమే అని చెప్పేయడంతో.. బాబీ చేసేదేమీ లేక థ‌మన్‌ను సెలెక్ట్ చేసుకున్నడ‌ట. అయితే.. అనిరుధ్ లాంటి ఓ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్.. సినిమాకు ఎస్ చెప్పి ఉంటే సాంగ్స్, ఎలివేషన్స్ లో మరింత హైలెట్గా నిలిచేదని.. చిరంజీవి సినిమాకు నో చెప్పి అనిరుధ్ చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు.