పరదా రివ్యూ.. అనుపమ సోషల్ డ్రామా హిట్టా.. పట్టా..!

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ చాలా లాంగ్ క్యాప్ తర్వాత న‌ర‌దా సినిమాతో డి గ్లామర్ రోల్‌లో పలకరించింది. ఫిమేల్ సెంట్రిక్ మూవీగా ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్‌లో సోషల్ డ్రామగా రూపొందింది. 22 ఆగస్టు 2025న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంది. హిట్టా.. ఫట్టా.. ఒకసారి చూద్దాం.

Paradha will be the best film of my career-Anupama Parameswaran

కథ
న‌డ‌తి అనే చిన్న గ్రామంలో ఆడవాళ్లంతా పరదాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో తండ్రి తప్ప వేరే పురుషుడు వాళ్ళ మొఖాలు చూడకూడదని.. చూస్తే అరిస్టం అని.. ఇక అక్కడ పిల్లలు పుట్టకుండా పురట్లోనే చనిపోతారని ఒక నమ్మకంతో ఊరి ప్రజలంతా బ్రతుకుతూ ఉంటారు. దానికి కారణం ఎప్పుడో జ్వాలమ్మా అనే ఒకరిని నలుగురు చెరబడితే ఆ వారితో పోరాడుతూ సజీవ సమాధి అయిందని.. ఆమె ఆత్మ ఊరికి శాపం పెట్టిందని నమ్ముతుంటారు. అదే క్షేత్ర క‌థ కూడా. ఇక్కడే పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (అనుపమ) అదే ఊళ్ళో రాజేష్ (రాగ్ మయూర్) అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. సరిగ్గా నిశ్చితార్థం సమయానికి అనుపమ నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడంతో పెద్ద గొడవ జరిగి ఆ వేడుక అక్కడితోనే ఆగిపోతుంది. పైగా.. అలా మొహం బయటపడిన అమ్మాయి ఆత్మాహుతి చేసుకోవాలని రూల్ అక్కడ ఉంటుంది. ఈ క్రమంలోనే సుబ్బలక్ష్మి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఫైనల్ గా ఏం జరిగిందనేది మిగతా కథ.

రివ్యూ:
ఉమెన్ సెంట్రిక్‌ మూవీ.. ప‌డ‌తి అపే చిన్న‌ గ్రామాన్ని తీసుకొని అక్కడ నుంచి కథ నడపాలని ఆలోచన బాగున్నా.. సబ్జెక్ట్ ఎక్కడ నేచురల్ గా అనిపించలేదు. అసలు మ్యాగ్జిన్ చదవడం జనాలు మానేసిన రోజుల్లో ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ ను దేశవ్యాప్తంగా హోల్డింగ్లా పెడుతుంటే.. ఊళ్ళో పోలీసులకు కూడా అక్క‌డ తప్పు జరుగుతుందని తెలీదా.. అసలు ఊర్లో ఆడవాళ్ళ ఒక్క‌ ఇంట్లో తండ్రి తప్ప మరెవరు చూడకూడదంటే.. ఆ ఊళ్లో ఆడవాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండవా.. ఆ ఫోటోలు ఎవరు తీసినట్లు అనే సందేహాలు అందరిలోనూ వ‌స్తాయి. ఎక్కడ కథ నేచురల్ గా కన్వెన్షన్ గా అనిపించలేదు. పైగా తనను ఫోటో తీసింది ఎవరో తెలుసుకోవడానికి ఊరికే హిమాలయాలు దాకా వెళ్లడం ఏంటి.. దానికి గ‌ల‌ కారణాలేంటో డైరెక్టర్ చెప్పాలని ప్రయత్నించిన.. అది నాచురల్ గా అనిపించలేదు. ది కేరళ స్టోరీస్ సినిమాలో ఎన్నో కష్టాలు పడి చివరకు స్వేచ్ఛ‌ పొందిన ఓ స్త్రీ బుర్కాని మంటల్లో కాల్చిన సీన్.. మళ్లీ ఈ సినిమాలో రిపీట్ అయినట్లు అనిపించింది.

Pardda: അനുപമ പരമേശ്വരൻ നായികയായി പര്‍ദ്ദ, ചിത്രത്തിന്റെ ദൈര്‍ഘ്യം പുറത്ത്  | Anupama Parameswaran Starrer Pardda Film Running Time | Asianet News  Malayalam

కాకపోతే ఇక్కడ బుర్కా కాదు పరదా చాటున జీవితం గడిపి.. దానిని వదిలించుకుని ఒక స్త్రీ మూఢనమ్మకాన్ని ఎదురుగా ధైర్యంగా ఎలా నిలబడింది అనేది కథ‌. ఇక ఎడతెరిపి లేకుండా ఎప్పటికప్పుడు పనులు చేస్తూ మిషన్ల గడిపే గృహిణి.. బయటకు వచ్చి కొన్ని రోజులు ఎలా స్వేచ్ఛగా గడిపింది.. మగాళ్ళపై వివాహ వ్యవస్థ పై అసలు పాజిటివ్ నమ్మకమే లేని ఓ అమ్మాయి.. ఓ లేడీ ఆర్మీ ఆఫీసర్ని చూసి తన ఆలోచనలను ఎలా మార్చుకుంది.. అనే సబ్ ప్లాట్ లతో మూవీ నడిచింది. ముఖ్యంగా సినిమాకి ఓ హారర్.. డివోషనల్ టైపు మూడ్ ని సెట్ చేసి.. తర్వాత అవుట్ హాఫ్ రూపొందించడం.. ఎడతెగని రోడ్ జర్నీ సినిమాకు బోరింగ్‌గా అనిపించాయి. హీరోయిన్ కి సైంటిఫిక్ టెంపర్ మెంట్ ఇప్పించడానికి రొటీన్ సీన్స్ పెట్టడం చాలా కృత్రిమంగా అనిపించింది.

టెక్నికల్ గా:
మ్యూజిక్ పరంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ముగ్గువే.. సాంగ్ మూడ్‌ను యాక్టివ్ చేసింది. కెమెరా వర్క్‌, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ అన్ని.. సినిమాకు క్వాలిటీ రిచ్‌గా అనిపించాయి. సినిమా క్వాలిటీ ఎంత బాగున్నా.. కథలో కంటెంట్ లేకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే.

Paradha (2025) - Movie | Reviews, Cast & Release Date in Bhagalpur-  BookMyShow

నటి నటుల పర్ఫామెన్స్:
అనుపమ తన రోల్ కు 100% న్యాయం చేసినట్లు అనిపించింది. ఏమాత్రం గ్లామర్ తురకలు లేకుండా సహజంగా ఓ మారుమూల పల్లెటూరి అమ్మాయిల మెరిసింది. అలా అని తన కెరియర్ లో ఇదే ఉత్తమమైన పాత్ర అనడానికి కూడా లేదు. అంత ఇంపాక్ట్ స్టోరీ క్రియేట్ చేయలేకపోయింది. ఇక రాగ్‌ మయూర్ మొదట హీరో అనే ఫీల్ కలుగుతుంది. హీరోయిన్ వైపు నుంచి పోరాడి క‌థ‌ను ఏదో మలుపు తిప్పుతాడు అని అంతా అనుకుంటారు. కానీ అనుపమ లీడ్ ఇమేజ్‌ తగ్గిపోకూడదని పాత్రను రొటీన్‌ పద్ధతిలోనే సైడ్ ట్రాక్ పట్టించి.. రొటీన్ స్టోరీ గా మార్చేశారు. ఇక రాజేంద్రప్రసాద్ రోల్ అయితే అసలు ఎందుకు ఉందో అర్థం కాదు. పెద్ద ఇంపార్టెన్స్ లేదనిపించింది. కొన్ని ఫ్రిచింగ్ డైలాగ్స్ చెప్పడానికి మాత్రమే సినిమాలో ఆయన రోల్ ఉన్న‌ ఫీల్ కలుగుతుంది. సంగీత హర్షవర్ధన్.. ట్రాక్ సినిమాకు కాస్త బెస్ట్ అనిపించింది. మరి కాస్త ఆమె రోల్ లెన్త్ ని పొడిగించిన బాగుండేదేమో అన్న ఫీల్ ఆడియన్స్ కి వస్తుంది. ఇక దర్శన రాజేంద్రన్.. బోల్డ్ లేడీ గా ఒదిగిపోయింది. బలగం మూవీ ఫ్రేమ్స్ సుధాకర్ రెడ్డి సైతం తండ్రి పాత్రలో మెప్పించాడు.

ఎంత ఫిమేల్ సెంటర్ సినిమా అయినా.. మొత్తం మగాళ్ళంతా ఓ టైపులో ఉంటారని హాట్ కోర్ కిమిస్టుల ఆలోచించడం చాలామంది ఆడవాళ్ళకే అసలు నచ్చలేదు. చిన్న రోల్‌ అయినా లేడీ ఆర్మీ ఆఫీసర్.. కాస్తే మెచ్యూర్డ్‌గా మాట్లాడి ఉంటే బాగుండేది. మగాళ్లు ఎప్పుడు అర్థం చేసుకోరు అన్నట్లుగా ఆమె కూడా మోస పద్ధతిలో మాట్లాడడం సినిమాకు నెగటివ్. ఈ పాత్రను మెచ్యుర్డ్‌గా చూపించి సరైన డైలాగ్స్ పెట్టి ఉంటే ఆడియన్స్ కనీసం ఆకట్టుకునేది. ఇక ప్రాథమిక హక్కుల లానే.. ప్రాథమిక బాధ్యతలు అనేది సాధారణంగా రాజ్యాంగంలోనే ఉంది. వాటిలో ఒకటి మూఢనమ్మకాలను నిలదీసి సైంటిఫిక్ రీసన్ ను కనుగొనడం. ఆ కేటగిరీలో ట్రై చేసిన మూవీ.. దీంతో పాటు మహిళా సాధికారతను కూడా కలిపి ఒక కథను తెరకెక్కించే ఎలాగైనా స‌క్స‌స్ కొట్టాల‌ని సినిమాను తీశారు. కానీ.. కమర్షియల్ గా కథలో కంటెంట్‌ను స్క్రీన్ ప్లేను పెద్దగా పట్టించుకోలేదని ఫీల్ కలుగుతుంది. దీంతో ఆడియన్స్ కు సినిమా చూసేటప్పుడు చిరాకు వస్తుంది. ఆర్ట్ ఫిలిం అంటే లాజిక్ గా ఉండాలి.. కమర్షియల్ అంటే కనీసం స్టోరీలో మ్యాజిక్ అన్న వర్కర్ కావాలి. ఈ రెండు సినిమాలో మిస్ అయ్యాయి.. దీంతో సినిమా చూసే ఆసక్తి పోతుంది.

ఫైన‌ల్‌గా.. క‌థ‌కే ప‌ర‌దా.. ఆడియ‌న్స్‌లో నీర‌సం.