వార్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్ లెక్కలివే.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

మ్యాన్ ఆఫ్‌ మాసేస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ వార్ 2. బాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్ య‌ష్‌ రాజు ఫీలిమ్స్‌ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో.. కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. యాక్షన్ థ్రిలర్‌గా.. అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ట్రైలర్, మ్యూజిక్, హై ఓల్టేజ్‌ యాక్షన్.. ఇలా ప్రతి ఒక్కటి సినిమా పై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే.. సినిమా హైప్ రిత్యా భారీ ఓపెనింగ్స్ నే దక్కించుకున్నా.. రిలీజ్ అయిన తర్వాత వచ్చిన మిక్స్డ్ టాక్‌తో ఊహించిన రేంజ్‌లో అంచ‌నాలు అందుకోలేకపోయింది.

అయితే.. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి నెంబ‌రే దక్కించుకుంది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్.. మూడు రోజులు వరుస హాలిడేస్ కావడంతో సినిమాకు క‌లిసొచ్చింది. రికార్డు లెవెల్ లో వసూలు ద‌క్కాయి. సోమవారం నుంచి కలెక్షన్ల పరంగా వార్ 2 కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మేకర్స్ తాజాగా.. ఇప్పటివరకు పాన్ వ‌ర‌ల్డ్‌ రేంజ్‌లో వార్ 2 సినిమా.. రూ.300.50 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లు కొల్లగొట్టిందని అఫీషియల్ గా ప్రకటించారు. ఇక.. ఇందులో ఇండియన్ మార్కెట్ ఎంత.. ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. ఇప్పటివరకు ఇండియాలో వార్ 2కు రూ.240 కోట్ల గ్రాస్ వచ్చిందని.. రూ.196.50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. అంతేకాదు.. ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

ఈ క్రమంలోనే అక్కడ రూ.70.50 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు నిర్మాతలు అఫీషియల్ గా వెల్లడించారు. అయితే.. వార్ 2 కలెక్షప్‌ల‌పై కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి సినిమా ప్రభావం చాలానే పడిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్ 2 రిలీజ్ అయిన రోజున ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వడం.. రెండు భారీ సినిమాల మధ్య ఏర్పడిన పోటీ కారణంగా వార్ 2 కలెక్షన్లపై సినిమా ప్రభావం కనిపించింది. అయినా మొదటివారం స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇస్తూ రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడం అంటే అది సాధారణ విషయం కాదు. ఏదేమైనా వార్ 2కి తెలుగులో మరింతగా కలెక్షన్లు ద‌క్క‌డానికి కారణం ఎన్టీఆర్ విలన్ రోల్ లో మెరవడమేనని.. ఎన్టీఆర్‌ను ప్రతి నాయకుడిగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ రన్‌లో ఏ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.