ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తే రిజల్ట్ అదేనా.. పెద్ద మిస్టేక్ చేశాడే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. సెలబ్రిటీల లైఫ్సే కాదు.. సినిమాల విషయంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అత్యంత భారీ బడ్జెట్లో రిలీజ్ అయిన సినిమాలు సైతం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన సందర్భాలు.. అలాగే అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై.. కోట్లల్లో కలెక్షన్ కొల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా కథ ఎంత బాగున్నా.. కంటెంట్ పై ఎంత నమ్మకం ఉన్నా.. ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందో ఎవరు ముందు చెప్పలేరు. ఈ క్రమంలోనే మేకర్స్ కు లేదా క్యాస్టింగ్ సినిమా పై నమ్మకం ఉండొచ్చు కానీ.. అతి నమ్మకం పనికిరాదంటూ మరోసారి తాజాగా వచ్చిన సినిమా విషయంలో రుజువు అయ్యింది. ఇండస్ట్రీలో చాలా వరకు మేకర్స్ ఎవరు తమ సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ ముందే చెప్పుకోరు.

బాగా తీశాం.. కచ్చితంగా ఆడుతుంది అంటారు తప్ప.. అంతకుమించి ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ని చూపించరు. కానీ వార్ 2 విషయంలో ఎన్టీఆర్ ఆ తప్పుచేసి చూపించాడు. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ అందరికి గుర్తుండే ఉంటాయి. ఒకటి కాదు రెండు కాలర్లను ఎగరేస్తూ.. ఎవరెన్ని చెప్పినా.. బొమ్మ బ్లాక్ బ‌స్టర్ అంటూ.. తారక్‌ కామెంట్ చేశారు. సాధారణంగా ఇలాంటి స్టేట్మెంట్‌స్‌ ఎన్టీఆర్ చాలా రేర్ గా ఇస్తూ ఉంటాడు. అది కూడా.. తన సినిమాల విషయంలో అసలు చెప్పడు. గతంలో అన్న కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి సినిమా విషయంలో మాత్రమే ఆయన ఇలాంటి కామెంట్ చేశారు.

Shall I leave?: Jr NTR snaps at fan during War 2 event, shuts down  disruption in Hyderabad | Bollywood - Hindustan Times

కచ్చితంగా మా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉందంటూ తారక్ ధీమా వ్యక్తం చేసాడు. అయితే.. అప్పట్లో తారక్ చేసిన కామెంట్స్ అసలు వర్కౌట్‌ కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే.. మరోసారి ఎన్టీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడని.. వార్ 2తో అనవసరంగా రెండు కాలర్లు ఎగరేసి మరి స్టేట్మెంట్లు చేశాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయి ఘోరమైన టాక్ తెచ్చుకుంది. కథలో బలం లేదని అసలు పెద్దగా స్టోరీ లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వీక్ అంతా కూడా పూర్తవకముందే సినిమా ఆక్యుపెన్సీ భారీగా తగ్గిపోయింది. ఇక ఎన్టీఆర్ అసలు ఏ నమ్మకంతో సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రెండు కాలర్లు ఎగరేసాడు అంటూ ఫ్యాన్స్ అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాలర్ ఎగరేస్తు సినిమా బ్లాక్ బ‌స్టర్ అని చెపక‌పి బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాడంటూ.. ఇప్పుడు రిజల్ట్ మూల్యం చెల్లించుకుంటున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.