యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2. బిగెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో కియారా హీరోయిన్గా మెరిసింది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిస ఈ మూవీ నిన్న(ఆగస్ట్ 14)న గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత తెలుసుకోవాలనే ఆశక్తి అందరిలోను మొదలైంది. ఆ లెక్కలేంటో ఓ సారి చూద్ధాం.
యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక వార్ 2 ఫస్ట్ డే బాక్సాఫీస్ వసూళ్ల లెక్కలోకి వెళితే.. ఇండియాలో హిందీ వెర్షన్‌కు రూ.40 కోట్ల వరకు గ్రాస్ రాగా.. తెలుగులో రూ.30 కోట్లు, తమిళ్లో రూ.1 కోటి గ్రాస్ దక్కించుకుందట. ఇక ఓవర్సీస్ మార్కెట్లో రూ.15 కోట్ల వరకు వచ్చాయి. కాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో హృతిక్, టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఇమేజ్‌తో రిలీజ్‌కు ముందు నుంచే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ దక్కాయి. అలా ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమయ్యాయని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇక అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ.. తొలి రోజే సుమారు రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వారం లాంగ్ వీకెండ్ వల్ల రెండు సినిమాలకు కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఇక శుక్ర, శని, ఆదివారలలో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన సినిమాలకు కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.