యంగ్ టైగర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా మరో మూడు రోజుల గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఫస్ట్‌డే బుకింగ్స్ నెటింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ బడా ప్రాజెక్టులతో పోటీ పడుతున్న వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. నేషనల్ మల్టీప్లెక్స్ లలో టికెట్ సేల్స్ ఏ విధంగా ఉండనున్నాయి..? ఇతర బిగ్ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే వార్ 2 ఏ పొజిషన్లో నిలిచింది..?
ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఆడియన్స్ లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసుకుంది..? తెలుసుకోవాలని ఉత్సాహంలో అభిమానులు మునిగిపోయారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తారక్, హృతిక్ కాంబోలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరువనున్న ఈ సినిమా బాలీవుడ్ లో ఫస్ట్ డే 20 వేల టికెట్లు మాత్రమే సేల్ చేసుకుందట. పివిఆర్, ఐమాక్స్ లో 14,500, సినీ పొలైస్‌లో 4750 టికెట్లు బుక్ అయ్యాయని తెలుస్తుంది. అయితే.. సైయారా ఫస్ట్ డే 34000, ఛావా 27000 టికెట్లతో సేల్స్ జరుపుకుంటే.. ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తూ వార్ 2కు.. మరి ఇంత తక్కువగా బుకింగ్స్ జరగడం ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
పఠాన్, జవాన్, పుష్ప 2 లాంటి రికార్డు బ్రేకింగ్ సినిమాలతో పోలిస్తే వార్ 2 మరింత వెనుకబడిపోయింది. మూడు రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. ఓపెనింగ్స్ మరీ ఇంత డల్ గా ఉండడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అయినా సినిమా టికెట్స్ బుకింగ్ లో జోరు చూపిస్తుందేమో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం 5000 స్క్రీన్ లలో గ్రాండ్ గా రిలీజ్ కాలు ఉన్నాయి సినిమా బాక్స్ ఆఫీస్ను బ్లాక్ చేస్తుందా లేదా ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.