రజనీకాంత్ కూలీ ఫస్ట్ రివ్యూ.. లోకేష్ హిట్ ట్రాక్ కు..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్‌కాంబోలో రానున్న లేటెస్ట్ మూవీ కూలీ. మరో 5 రోజుల్లో సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక రజనీకాంత్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిచోట్ల సినిమా చూసేందుకు లీవ్‌ కావాలని కార్పొరేట్ కంపెనీలకు ఉద్యోగులు లెటర్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక కబాలి తర్వాత మళ్ళీ అదే రేంజ్ హైప్‌ కూలీ సినిమాకు ఏర్పడింది.

లోకేష్ కనకరాజు హిట్ ట్రాక్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరు కాంబోలో వస్తున్న సినిమా కావడం.. నాగార్జున విలన్ పాత్రలో మెరవడంతో.. సినిమా పై మరింత హైప్‌ పెరిగింది. అంతేకాదు.. సినిమాలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్‌, శృతిహాసన్, అమీర్ ఖాన్ ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటుడు సినిమాలో మెరువనున్నారు. ఈ క్రమంలోనే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో రిలీజ్ కానున్న సినిమాకు స్పెషల్ షో వేశారు మేకర్స్. దీనికి కోలీవుడ్ ప్రముఖులు, సెలెక్టెడ్ నెంబ‌ర్‌ ఫ్యాన్స్, పలువురు మీడియా జర్నలిస్టులు.. కూలి సినిమాను ప్రైవేట్ స్క్రీనింగ్ లో వీక్షించారు.

హాజరైన ప్రతి ఒక్కరి నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందట. కబాలి తర్వాత రజనీకాంత్ ఈ రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చిన మూవీ కూలీనే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ కంటే నాగార్జున మరింత సర్ప్రైజింగ్ రోల్ ప్లే చేశాడని.. సినిమాకు ఆయన వెన్నెముక అంటూ ఇంటర్వెల్‌ బ్లాగ్‌కి అభిమానులకు మైండ్ బ్లాక్ పక్క అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శృతిహాసన్ సినిమాకి హైలైట్ గా ఉందని.. అమీర్ ఖాన్‌ రోల్ వ‌చ్చిన‌ప్పుడు థియేటర్లలో మోత మోగిపోవడం పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూపిస్తున్న కూలీ.. ఓవర్సీస్ మార్కెట్లో రెండు మిలియన్ డాలర్లకు చేరువగా నిలిచింది. కేరళ బుకింగ్ అయితే ఓపెన్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 2 గంటలకు 80 వేల టికెట్లకు పైగా సేల్స్ జరిగాయి. ఇక ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ కూలి ఓపెన్ బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి.