స్టార్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అమ్మడి యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్.. ఇలా అన్నిటితోనో ఆద్యంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తాను చేసిన రేస్, రైడ్, వెల్కమ్, హై స్కూల్, ఫాత ఎలాంటి సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయో తెలిసిందే. ఈ క్రమంలోనే జాక్వాలిన్ త్వరలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్గా మెరవనుందని.. అది కూడా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా అంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఇప్పటికే డైరెక్టర్ జయశంకర్ తెలుగులో పేపర్ బాయ్, ఆరి లాంటి సినిమాలను తెరకెక్కించి.. మంచి సక్సెస్ను అందుకున్నారు. ఇక.. తాజాగా జయశంకర్, జాక్వాలిన్‌కు యాక్షన్ సస్పెన్స్‌తో నిండిన ఒక కథను వివరించారు. ఈ పాత్ర, కథ వెంటనే నచ్చేయడంతో ఆమె స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసిందని తెలుస్తుంది. ఇక కథలో.. కొన్ని హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్‌తో కథ నిండి ఉన్న క్రమంలో.. జాక్వాలిన్ కూడా ఈ రోల్ ప్లే చేసేందుకు ఉత్సాహం చూపించిందట.
దీంతో జాక్వలిన్ ఈ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా.. ఇదివరకు ఎప్పుడూ చూడని సరికొత్త తరహాలో అద్భుతమైన పాత్రలో.. అమ్మడు మెరవనుందని.. స్క్రిప్ట్ లో విఎఫ్‌ఎక్స్‌కు సంబంధించిన వర్క్ కూడా చాలానే ఉంటుందని తెలుస్తుంది. ప్రేక్షకులను కట్టు పడేసేలా థ్రిల్లింగ్ అంశాలను జోడించి సినిమాను రూపొందించనున్నడట జయశంకర్. జాక్వలిన్ పాన్ ఇండియా యాక్టర్స్ కావడంతో.. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట టీం. ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్న జయశంకర్.. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం.