తాజాగా మెగా ఇంటి కోడలు.. రాంచరణ్ సతీమణి అయిన ఉపాసన తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక బాధ్యతలను అందిపుచ్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. అసలు మ్యాటర్ ఏంటంటే తెలంగాణ క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీ 2025ను తీసుకొచ్చింది. రేవంత్ ప్రభుత్వం తాజాగా స్పోర్ట్స్ హాబ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసి ఈ సంస్థకు చైర్మన్గా.. సంజీవ్ గోయంక్‌ను నియమించారు. కో ఛైర్మెన్ పదవి కోసం.. మెగా కోడలు ఉపాసన కామినేని ని.. రేవంత్ ఎంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉపాసన కేటాయించిన బాధ్యతలపై అఫీషియల్గా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ బాధ్యతల కేటాయింపు పై ఉపాసన రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్‌గా నియమించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పంచుకుంది. నాకు ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని.. తనకు సంజీవ్ గోయాంకర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం మరింత గౌరవంగా భావిస్తున్నానంటూ ఉపాసన రాసుకొచ్చింది. బోర్డ్ సభ్యులుగా సన్ టీవీ నెట్వర్క్ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, బూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను తెలంగాణ ప్రభుత్వం నియమించే నిర్ణయాన్ని తీసుకుంది.
క్రీడల్లో దేశం మొత్తానికి తెలంగాణ రోల్డ్ మోడల్‌గా నిలవాలని సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో వెల్లడించారు. ఈ విధానంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఉద్దేశంతో.. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో క్రీడా పాలసీని రూపొందించమంటూ తెలియజేసిన ఆయన.. క్రీడా రంగాన్ని ప్రోత్సహించే కార్పొరేట్ సంస్థలు ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించి.. ఈ బోర్డును ఏర్పాటు చేసాం. రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలని లక్ష్యంతోనే దీన్ని తీసుకొచ్చామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో మెగా ఫ్యాన్స్.. ఉపాసనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. అసలు క్రీడా ఫీల్డ్‌లో ఎలాంటి అనుభవం లేని ఉపాసన కంటే దానిపై పట్టు ఉన్నవారికి ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే బాగుండేది అంటూ.. క్యాస్ట్ ఫీలింగ్ చూపించారంటూ.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.