తారక్‌తో డ్యాన్స్ చాలా కష్టం.. భయపడ్డా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అద్భుతంగా డ్‌జ్ఞౄన్స్ వేసి సత్తచాటుకునే స్టార్ హీరోల లిస్ట్‌లో కచ్చితంగా టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఎంత కష్టతరమైన స్టెప్స్ అయినా ప్రాక్టీస్ లేకుండా పర్ఫెక్ట్ గా చేసే సత్తా ఉన్నా హీరో ఎన్టీఆర్ అంటూ ఇప్ప‌టికే ఆయనతో కలిసి పనిచేసిన కోస్టర్స్ ప్రసంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక తారక్‌తో సమానంగా టాలీవుడ్‌లో డ్యాన్స్ చేయగల హీరోల పేర్లలో చరణ్, బన్నీ పేర్లు వినిపిస్తే బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక హృతిక్ రోషన్ తన డ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌, మ్యాజిక్ తోనే ఆడియన్స్‌కు కనెక్ట్ అయిపోతాడు. ఎలాంటి స్టార్ డ్యాన్సర్స్ అయినా.. ఆయన తన గ్రేస్ ఫుల్ స్టైలిష్ డ్యాన్స్‌తో వాళ్లను డామినేట్ చేయడమే హృతిక్ స్టైల్. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వార్ 2 సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్యాన్స్ చేస్తే చూడాలనేది కోట్లాదిమంది అభిమానుల కల.

ఎట్టకేలకు ఈ సినిమాతో అది నెరవేరుతుంది. ఎన్టీఆర్ కాంబోలో రానున్న వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన థియేటర్లు ట్రైలర్‌ను రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను కూడా దక్కించుకుంది. అయితే.. సినిమాకు మాత్రం ఊహించిన రేంజ్ లో హైప్‌ రాకపోవడం.. ఫాన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ఇక ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు.. అటు హృతిక్ రోషన్ అభిమానులు సైతం వీళ్ళిద్దరికీ కాంబోలో వచ్చే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటని ఫైనల్స్ షెడ్యూల్లో పూర్తి చేశారు. రీసెంట్గా బాలీవుడ్ మీడియా ఛానళ్లకు హృతిక్ రోషన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాట గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి చెబుతూ.. ఎన్టీఆర్ అసాధారణమైన డ్యాన్సర్. నేను ఆయన డ్యాన్స్ కి పెద్ద అభిమానిని. మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి వార్ 2లో నటించా. మా ఇద్దరి మధ్య ఒక డ్యాన్స్ ఫేస్ ఆఫ్ ఉంది. ఎన్టీఆర్ స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడం చాలా చాలా కష్టం అంటూ హృతిక్ రోషన్ కామెంట్స్ చేశాడు.

War 2 Update: Hrithik Roshan & Jr NTR Set for Epic Dance Face-Off in June  at YRF Studios

అతనితో అసలు రిహార్ సెల్స్ కూడా అవసరం ఉండదు.. అతని లోపలే డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి. మొదట్లో తారక్ తో డ్యాన్స్ అంటే కాస్త భయపడ్డా. కానీ.. ఆ తర్వాత నాకు అది చాలెంజింగ్‌గా తీసుకొని డ్యాన్స్ చేశా అంటూ వివరించాడు హృతిక్. ఎన్టీఆర్ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ గొప్ప డ్యాన్సర్.. మరో గొప్ప డ్యాన్సర్ గురించి ఈ రేంజ్ లో హైలైట్ చేయడంతో మురిసిపోతున్నారు. ఇక హృతిక్ రోషన్ ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ అది చాలా పర్ఫెక్ట్ గా అద్భుతంగా వచ్చింది కచ్చితంగా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది అంటూ వివరించాడు. ఎన్టీఆర్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో హృతిక్ గురించి మాట్లాడుతూ ఆయన డ్యాన్స్ ముందు.. నా డ్యాన్స్ ఎంత.. ఆయన ఓ లెజెండ్.. తన ముందు నేను పనికిరాను అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో వచ్చే ఆ సాంగ్ పై ఆడియన్స్ లో మంచి హైప్‌ మొదలైంది.