టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని.. స్టార్ డైరెక్టర్లుగా సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో దర్శకధీరుడుగా సత్తా చాటుకున్న రాజమౌళి సైతం.. అంతకంతకు తన క్రేజ్ను పెంచుకునే ప్రయత్నంలో బిజీ అవుతున్నాడు. ఎక్కడ తన సినిమాల క్వాలిటి, విజువల్స్, స్టోరీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికైనా బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను సాసించే రేంజ్‌కు ఎదిగినా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో టాలీవుడ్‌కు ఆస్కార్ అవార్డ్ తీసుకువచ్చినా.. ఇంకా టాలీవుడ్‌కు మరింత కీర్తిని పెంచేందుకు కసితో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్‌లో బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. మహేష్ బాబుతో కలిసి ఆయన చేస్తున్న యాక్షన్ అడ్వెంచర్స్ జానర్ మూవీపై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. దీంతో తనను తాను మరోసారి ఎలా ఎలివేట్ చేసుకోనున్నాడనేది అభిమానులను ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో జక్కన్న తన మాటలు క్రియేట్ చేసుకుంటే మాత్రం రాజమౌళి ఇండస్ట్రీలో తిరిగే ఉండదు అనడంలో సందేహం లేదు. ఏదేమైనా రాజమౌళి సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలా.. తాను తెరకెక్కించే సినిమా విషయంలో డైలాగ్స్ కూడా ఎంతో పవర్ఫుల్‌గా ఉండేలా డిజైన్ చేస్తాడు జక్కన్న.
ఈ క్రమంలోనే మొదట్లో ఏం. రత్నంతో డైలాగులు రాయించిన ఆయన.. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పాపులర్ డైరెక్టర్ సాయిమాధవ్ బొర్రను ఎంచుకున్నాడు ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ఇంటర్నేషనల్ ఫిలిం కోసం తెలుగులోనే టాప్ డైరెక్టర్లలో ఒకరైన దేవకట్టను సెలెక్ట్ చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ లోని క్లైమాక్స్ సీన్స్ కోసం దేవకట్టనే డైలాగ్స్ అందించాడు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఉన్న ర్యాపో రాజమౌళికి దేవ కట్టపై ఉన్న నమ్మకంతో మహేష్ బాబు సినిమా డైలాగ్ రైటింగ్ బాధ్యతలను ఆయనకు అప్పగించాడు. దేవకట్ట సైతం ప్రస్తుతం తన సినిమాలను చేస్తూనే.. మరోపక్క రాజమౌళి సినిమా కోసం డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఇలా.. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన దాదాపు అన్నిసినిమాలకు పాపులర్ స్టార్ డైరెక్టర్‌లను డైలాగ్ రైటర్లుగా వాడేయడం విశేషం.