సినీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే.. బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెప్పగానే.. అందులో నటించే స్టార్ హీరో, హీరోయిన్లు, సెలబ్రిటీల పేర్లు మాత్రమే ముందుగా ఆడియన్స్‌కు గుర్తుకు వస్తాయి. కానీ.. ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైన దర్శకుల పేర్లు మాత్రం వెంటనే మర్చిపోతారు. ఏదేమైనా.. స్క్రీన్‌పై కనిపించేది నటీనటులే కాబట్టి.. ప్రేక్షకులు సైతం.. వాళ్లపై ఫోకస్ పెట్టి వారిని అవమానిస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలే కాదు.. వారి వారసులుగా ఎంట్రీ ఇచ్చే నెక్స్ట్ జనరేషన్ హీరోలపై కూడా ఆడియన్స్‌లో మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొంటాయి.
కానీ.. కొన్ని సందర్భాల్లో ఆ హీరోలు.. అంచనాలను అందుకోలేక డీలపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంగానే ఎన్నో నెగటివ్ కామెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా.. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం.. ఎన్నో నెగటివ్ కామెంట్లు ఫేస్ చేశాడు. ఆయనతో పాటు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోలు సైతం సక్సెస్ లో అందుకొని టాప్ పోసిషన్‌కు వెళ్తుంటే.. మహేష్ బాబు మాత్రం వరుసగా మూడు, నాలుగు సినిమాలతో ఘోరమైన డిజాస్టర్లు అందుకొని ఫేడౌట్ దశకు వెళ్లిపోయారు. అలాంటి.. క్రమంలో ఓ క్రేజి హీరో వదిలేసిన సినిమాలతో మహేష్ బ్లాక్‌బస్టర్‌లు కొట్టి స్టార్ హీరోగా మారాడట.
ఇంతకీ ఆ క్రేజీ స్టార్ హీరో ఎవరో కాదు ఉదయ్ కిరణ్. ఒకప్పుడు ఉదయ్ కిరణ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోస్ అంతా ఉదయ్ కిరణ్‌తో సినిమా చేయాలని ఆరాటపడుతూ ఉండేవాళ్ళు. అలా.. మహేష్ బాబు నటించిన రెండు సినిమాలకు సైతం మొదట ఉదయ్ కిరణ్‌ను హీరోగా భావించారట దర్శకులు. ఇంతకీ ఆ సినిమాలేవో కాదు.. మహేష్ కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయిన అతడు, ఒకడు. ఈ రెండు సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న మహేష్.. సూపర్ స్టార్‌గా మారి.. తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు.