టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఒకటి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమనులు కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది.
తాజాగా.. సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌లో గూస్ బంప్ తెప్పించేలా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఓజి నుంచి ఆగస్టు 2న ఉన్న ఫస్ట్ సింగల్ రిలీజ్ చేస్తామని టీం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు సాయంత్రం సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కానీ.. అనుకున్న సమయాన్ని కంటే ముందే సాంగ్ రిలీజ్ చేసి మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక సాంగ్ కేవలం పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుంది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంఉంది. ఫైర్ స్ట్రోమంటూ హై అండ్ ఎనర్జీటిక్ బీట్స్‌తో థమన్ డిజైన్ చేసిన ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటుంది. అయితే సాంగ్ అంతా ఓక ఎతైతే.. సినిమాల్లో పవన్ కళ్యాణ్ లుక్స్ మరో లెవెల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల కాలంలో పవన్ మరే సినిమాలో ఈ రేంజ్ హ్యాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకోలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో ఓజిలో తాను ఒక పాట పాడాలని తమిళ్ స్టార్ సింబు స్వయంగా వెల్లడించారు. అదే ఫైర్ స్ట్రామ్ అంటూ చెప్పకొచ్చాడు. ఇప్పుడు సింబు పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే.. ఈ సాంగ్ సిమ్ము ఒక్కడే పాడలేదు.. థమన్, నజీరుద్దీన్, భరద్వాజ్, దీపక్ బ్లూ కూడా పనిచేశారు.