ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లకు తమ అభిమానులు ఏదైనా విషయన్ని చేర్చాలన్న.. వాళ్లతో ఈ విషయాలపై ముచ్చటించాలన్న నెలలకు నెలలు, ఏళ్లు గడిచిపోయేది. కానీ.. ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలో ఏది చెప్పాలన్న.. తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు క్షణాల్లో చేర వేసేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెలబ్రిటీలు సైతం లైవ్ చిట్ చాట్ అంటూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంతోమంది అభిమానల సందేహాలను తీరుస్తూ.. వాళ్ళ దిల్ కుష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద స్టార్ సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలపై అయ్యినఓపెన్ గా కామెంట్స్ చేసేస్తూన్నారు నెటిజన్లు. అలా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత జంటకు ఇప్పటికి టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాప్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి క్రేజ్‌తో రాణిస్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన.. ఐదు పదుల వయసు మీద పడుతున్నా.. ఇప్పటికీ లుక్స్, ఫిట్నెస్ తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక నమ్రత ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన.. మహేష్ తో పెళ్లి తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. అయినా.. ఫిట్నెస్ మాత్రం కాన్స్టంట్ గా మెయింటైన్ చేస్తూ.. స్టార్ హీరోయిన్లకు ఏం మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది. ఇలాంటి.. క్రమంలో మహేష్ బాబు పక్కన నమ్రత కంటే ఆ స్టార్ హీరోయిన్ పర్ఫెక్ట్ పెయిర్.
వాళ్ళిద్దరి జోడి చాలా అద్భుతంగా ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు కాదు.. చెన్నై చంద్రం త్రిష. ఎస్.. త్రిష, మహేష్ బాబు పెయిర్ ది బెస్ట్ పెయిర్ గా ఉంటుందంటూ.. నమ్రత కంటే.. మహేష్ పక్కన త్రిష కటౌట్ అదిరిపోతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అతడు సినిమా రిలీజ్ టైంలో ఎంతో మంది ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు ఇదే టాక్‌ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. నమ్రత, మహేష్ ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి వీరిద్దరూ అన్యోన్యమైన లైఫ్‌లో లీడ్ చేస్తున్నారు. ఇక పిల్లలు సితార, గౌతమ్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వకముందే.. మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. సోషల్ సర్వీస్ చేయడంలోనూ తండ్రికి తగ్గ పిల్లలుగా.. ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు.