మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా కోసం అభిమానులే కాదు.. సినీ ప్రియులు సైతం ఆశక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను అంతకంతకులేట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు సమాచారం.
మేకర్స్ నిర్ణయించిన ఆ డేట్.. ఇప్పుడు ఇంకాస్త వెనకు వెళ్లిందట. జనవరి 9, 2026 కు మారుతుంది. సంక్రాంతికి ప్రభాస్‌ను థియేటర్‌లో దింపాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరి కొంత టైం వెయిట్ చేయక తప్పదు. సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి అంటే ఎంత పెద్ద పండగో చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలోనే రాజాసాబ్ సినిమాకు ఈ అడ్వాంటేజ్ మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో రావాల్సి ఉండగా.. తర్వాత జూన్ 3, డిసెంబర్ 5న రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడుతుందని.. సంక్రాంతి బరిలో డార్లింగ్.. రాజాసాబ్ పక్కాగా వస్తుందంటూ తెలుస్తుంది. అయితే.. ఇంకా ఈ రిలీజ్ డేట్ ఛేంజ్‌పై మేకర్స్ మాత్రం అఫీషియల్‌గా స్పందించలేదు.