టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. భాగ్యశ్రీ హీరోయిన్గా, సత్యదేవ్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను.. సీతారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.
సినిమాను కచ్చితంగా ధియేటర్లు చూడాలంటూ.. దేవరకొండ ఏడేళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ కొట్టనున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీమాను చూసిన ఆడియన్స్ అంతా పాజిటీవ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా విజయ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్విట్ వైరల్ గా మారుతుంది.
కింగ్డమ్ రిజల్ట్‌ను ఉద్దేశించి.. మనం కొట్టినం అనే ట్యాగ్‌తో.. ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసుకుంది. ఈ సినిమా నీకు.. నిన్ను ప్రేమించే ప్రతి ఒకరికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ” మనం కొట్టినం “.. కింగ్డమ్ సక్సెస్ అయ్యింది అంటూ రష్మిక రాసుకొచ్చింది. అయితే తాజాగా రష్మిక ట్విట్‌కు విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. అదే పదంతో (మన కొట్టినం) అంటూ.. హార్ట్ ఇమేజితో రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌తో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం మరోసారి వైరల్ గా మారింది.