టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. తారక్ కెరీర్‌లోనే మొట్టమొదటి స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా బిగ్గెస్ట్ పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. దర్శకుడుగా అయాన్ ముఖర్జీ వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
త్వరలోనే సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. యాక్షన్స్ సన్నివేశాలు చాలా రిచ్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక.. ఈ సినిమా రిలీజ్ రోజున కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా సైతం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా తాజాగా షూట్ ను ముగించుకుంది. ఈ క్రమంలోనే కూలి మేకర్ సైతం ఆగస్టు 14న సినిమాలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
అయితే.. హీరో రజనీకాంత్ ఈ విషయంపై దర్శకుడుతో వారించారట. ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది.. వాళ్ళు ఒకవేళ రిలీజ్ డేట్ ను పోస్ట్ పని చేసుకుంటే అప్పుడు మన సినిమాను రిలీజ్ చేయండి.. లేదంటే వద్దని చెప్పారట. కానీ.. డైరెక్టర్ మాత్రం మొండిపట్టుతో అదే రోజున సినిమా రిలీజ్ చేయాల్సిందేనని ఫిక్సయ్యారు. దీంతో రజినీకాంత్ సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అయినా సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది నిర్మాతలు ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. ఇక అగష్టు 14న ఈ రెండు సినిమాలు గ్రాండ్ పోటీతో ఆడియన్స్ను పలకరించనున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏది నెంబర్ వన్ గా నిలుస్తుందో.. ఎవరు జెండా ఎగరేస్తారో వేచి చూడాలి.