మరో క్రేజీ డైరెక్టర్ కు చిరు గ్రీన్ సిగ్నల్.. శ్రీకాంత్ ఓదెల మూవీ లేనట్టేనా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వ‌య‌స్సుతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే మల్లిడి వశిష్ఠ‌ డైరెక్షన్లో చిరంజీవి సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పటికే పాలు స్కెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు అయితే చిరంజీవి లైన్లో నాని ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ వదల డైరెక్షన్లో మరో సినిమా ఉండనే ఉంది ఇలాంటి క్రమంలో చిరంజీవి మరో క్రేజీ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట న్యూస్ నెట్ వైరల్ గా మారుతుంది ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాబి కొల్లి.

Chiranjeevi - Bobby - Mythri Movie Makers - Telugu360

ఎస్.. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో వాల్తేరు వీర‌య్య సినిమా వచ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వ‌రుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగాస్టార్‌కు ఈ సినిమా స్ట్రాంగ్ త్రోబ్యాక్‌ను ఇచ్చింది. మెగాస్టార్‌తో పాటు.. మాస్ మహారాజ్‌ రవితేజ సైతం.. ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇద్దరు పాత్రలను బ్యాలెన్సింగ్‌గా చూపించిన‌ బాబి కొల్లి.. త‌న‌ డైరెక్షన్కు మంచి మార్కులు కొట్టేశాడు. ముఖ్యంగా బాబి.. చిరంజీవిని వింటేజ్‌ టోన్‌లో చూపించి ఆడియ‌న్స్‌ను ఆకట్టుకున్నాడు.

Pic Talk : Chiranjeevi and Srikanth promise violence with bloodied fists

ఈ క్రమంలోనే.. మరోసారి కాంబో రిపీట్ అవుతుందని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే.. ఇప్పటికే విశ్వంభ‌ర, మెగా 157 సినిమాలు ఆయన చేతిలో ఉండనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో బాబి మెగాస్టార్ కోసం యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరిని సిద్ధం చేశాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సినిమా సెట్స్‌ పైకి రానుంది అంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. దీంతో శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో ఇప్పటికే చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకు వస్తారో.. అసలు ఈ సినిమా వస్తుందో.. లేదో.. అనే సందేహాలు మొదలయ్యాయి.