ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతుందన్నా.. ఆడియన్స్ అందరి చూపు ఆ సినిమా ట్రైలర్ పైనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం సినిమా స్టోరీ ఏంటో ట్రైలర్తో అవగాహన వస్తుందని అభిప్రాయం. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం ట్రైలర్‌ను అస్త్రంగా వాడి ఆ సినిమాపై హైప్ పెంచేందుకు కష్టపడుతూ ఉంటారు. ట్రైలర్ కటింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా ట్రైలర్ కట్స్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ట్రైలర్ విషయంలో.. ఆడియన్స్ డిసప్పాయింట్ అయితే సినిమాపై హైప్ మొత్తం తుసుమని ఎగిరిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే.. వార్ 2 టైలర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిలర్ వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్‌ను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేశారు. ట్రైలర్ భారీ యాక్షన్ సీక్వెన్స్, హై క్వాలిటీ గ్రాఫిక్స్, విజువల్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్.. నిన్న తెలుగు, హిందీ, తమిళ్ మూడు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అయింది. తారక్ – హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయంటూ ట్రైలర్ కట్లో క్లారిటీ వచ్చేసింది.
ఇక కీయార కేవలం సినిమాలో గ్లామర్ పాత్రకి పరిమితం అవుతుంది అనుకున్న ఆడియన్స్ కు అమ్మడు యాక్షన్ ఫీట్‌లతో బిగ్ షాక్ ఇచ్చింది. హృతిక్, కియార మధ్య రొమాంటిక్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయి అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ట్రైలర్ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో వార్ 2 దూసుకుపోతున్నా.. ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నా.. గడిచిన 24 గంటల్లో కేవలం 54.71 మిలియన్ వ్యూస్ రావడం షాక్‌ను కలిగిస్తుంది. సాధారణంగా ఓ సినిమా ట్రైలర్ కు ఈ రేంజ్ వ్యూస్ రావడం అంటే గొప్ప విషయమే. కానీ.. ఇక్కడ ఎన్టీఆర్, హృతిక్ లాంటి ఇద్దరు బిగ్ బడా పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నా కూడా వ్యూస్ ఇంత తక్కువ రావడం ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్మెంటే. అంతేకాదు.. ఇండియన్ సినీ హిస్టరీలో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 10 ట్రైలర్‌ల్లో కూడా వార్ 2 ప్లేస్ దక్కించుకోలేకపోయింది.దీంతో ఫాన్స్ నిరసన వ్యక్తం చేసినా.. మరోపక్క ట్రైలర్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడానికి ఆలస్యమైనా.. సినిమా మాత్రం ఆకట్టుకోవడం ఖాయమని.. బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంటుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.