లోకనాయకుడు కమలహాసన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. కేవలం నటనతోనే కాదు.. డ్యాన్స్, సింగింగ్ ఇలా అన్నింటిలో తనదైన ముద్ర వేసుకొని మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. త్వరలో రజనీకాంత్ కూలీ సినిమాతో ఆడియన్స్‌న పలకరించింది. ఈ క్రమంలోనే కూలీ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్న శృతిహాసన్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్ల గురించి గుర్తుచేసుకుంది. ఎంత స్టార్ కిడ్ అయినా.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ తలుచుకుని ఎమోషనల్ అయింది.
2009లో బాలీవుడ్ మూవీ లక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్.. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రీఎంట్రీ ఇచ్చింది. 2011లో అనగనగా ఓ ధీరుడు తో పలకరించింది. ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. వెంటనే.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ దక్కించుకుంది. ఇలా వరుసగా తను నటించిన మూడు సినిమాలు ప్లాప్‌లుగా నిలవడంతో శృతిహాసన్‌కు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోయింది. అయితే.. ఈ సినిమా తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో తనపై పడిన ముద్రను చెరిపేసుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత తన కెరీర్ లో వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది. కాగా.. తాజా ఇంటర్వ్యూలో శృతిహాసన్ ఐరన్ లెగ్ ట్యాగ్‌పై రియాక్ట్ అవుతూ.. గబ్బర్ సింగ్ కంటే ముందు నేను తెలుగులో రెండు సినిమాలు చేశా.
అవి రెండు సరైన సక్సెస్ అందుకోలేదు. నన్ను ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. తెలుగులో.. నా మొదటి రెండు సినిమాలు ఒకే హీరోతో చేశా. కానీ.. నన్ను మాత్రమే ఐరన్ లెగ్ అన్నారు. మరి ఆ హీరో కాదా.. అంటూ మండిపడింది. సినిమా అంటే హీరోయిన్ మాత్రమే కాదు.. హీరో కూడా ఖచ్చితంగా ఉంటాడు. హిట్ కొడితే క్రెడిట్ హీరోకి ఇచ్చేసి.. ఫ్లాప్ అయితే హీరోయిన్‌ను బ్లెమ్ చేయడం మానేయండి అంటూ మండిపడింది. నాది ఐరన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెక్క కాదు.. నా కాళ్ళను నాకు వదిలేయండి అంటూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శృతి.. ఇదే ఇంటర్వ్యూలో త్రీ సినిమా ఫ్లాప్ అవడం నన్ను నిరాశపరిచిందని.. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డా.. అది ఇప్పటికి నన్ను బాధిస్తూనే ఉంది. ఇక త్రీ సినిమాను కనుక ఇప్పుడు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం శృతిహాసన్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.