వార్ 2 లో అలియా.. అమ్మడి పోస్ట్ మీనింగ్ అదేనా..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీలలో వార్ 2 ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో.. కియార‌ అద్వానీ హీరోయిన్గా మెర‌వ‌నుంది. అయితే.. ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ ఆలియా కూడా నటించనుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఆల్ఫాలో నటిస్తున్న ఆలియా భట్.. ఇందులో గెస్ట్ రోల్ లో క‌నిపించ‌నుందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్నా.. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు.

అయితే.. తాజాగా అలియా పెట్టిన పోస్ట్ మాత్రం వాటికి మరింత బలాన్ని చేకూర్తుంది. వార్ 2, ఆల్ఫా రెండు సినిమాలు య‌ష్ రాజ్ ఫిలిమ్స్ సంపై యూనివ‌ర్స్‌లో భాగంగా తెర‌కెక్కుతున్న సినిమాలే. పైగా ఆల్ఫాలో ఆలియాకు గురువుగా హృతిక్ రోషన్ న‌టిస్తున్నట్లు టాక్ గతంలో తెగ వైరల్ గా మారింది. కాగా.. ఇప్పుడు వార్ 2లో హృతిక్, ఆలియాకు మధ్య చిన్న సీన్ ఉండనున్నట్లు సమాచారం. ఇలాంటి క్రమంలో తాజాగా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్‌ను అలియా భట్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించింది.

Alia Bhatt praises best friend Ayan Mukerji for War 2 teaser; calls it his  pre-birthday gift | Bollywood - Hindustan Times

అద్భుతంగా ఉండనుంది. ఆగస్టు 14న థియేటర్లో కలుద్దాం అంటూ రాసుకొచ్చింది. ఈ లైన్ ప్రస్తుతం నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఈ క్యాప్షన్ తో ఆలియా కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనుందని అంత ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమా ఎన్టీఆర్‌కు బాలీవుడ్ డబ్యు మూవీ కావడంతో.. అటు బాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోను సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇక ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ సినిమాకు పోటీగా.. రజనీకాంత్ కూలి కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. రెండు సినిమాల్లో ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.