టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరస సినిమాలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా షూట్‌ను ఆల్మోస్ట్ పూర్తి చేశాడు చిరు. ఇటీవల అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సరికొత్త ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాకు సంబంధించిన పలు షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. కాగా.. తాజాగా మరోసారి చిరంజీవి విశ్వంభర సెట్స్‌లోకి అడుగు పెట్టాడు చిరు. సోషియా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. విఎఫ్‌ఎక్స్ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
అంతేకాదు.. సినిమాకు సంబంధించిన సాంగ్ షూటింగ్ ఎప్పటినుంచ పెండింగ్‌లో ఉంది. ఇలాంటి క్రమంలోనే సినిమాపై హైప్ తగ్గకుండా ఎప్పటికప్పుడు పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చిన మేకర్స్.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను రివిల్ చేశారు. విశ్వంభర షూటింగ్ ఎలాగో చివరి దశకు చేరుకుందంటూ ఈ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. శుక్రవారం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ కాగా.. ఇందులో భాగంగా స్పెషల్ సాంగ్ షూట్ చేశారు మేకర్స్.
దీనికి సంబంధించిన ఫోటో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ పిక్ స్వయంగా టీం లీక్ చేశారు. ఈ పాటకు గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ అఫీషియల్‌గా పంచుకుంటూ.. విశ్వంభర తన చివరి షెడ్యూల్‌ను అద్భుతమైన డ్యాన్స్ నెంబర్‌తో ప్రారంభించింది. మెగాస్టార్ స్టైల్ గ్రేస్‌తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నం. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ట్రీట్ ఎదురుచూస్తుందంటూ పేర్కొన్నారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ స్టెప్పులైనుందట. ఈ విషయం అఫీషియల్ గా వెల్లడించాల్సి ఉంది. కాదా నాగిని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యిన మౌనిరాయి.. తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 1లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడు చిరంజీవితో విశ్వంభరలో కలిసి స్టెప్పులేయనుంది.