మరో జాక్పాట్ కొట్టిన శ్రీ లీల.. బాలీవుడ్ బడా హీరో మూవీలో ఛాన్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలకు ప్రస్తుతం.. ఎలాంటి పాపులారిటీ ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు నటించినా చాలా సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచినా.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక కన్నడలోనూ పలు సినిమాల్లో నటించి అక్క‌డ కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యంగ్ బ్యూటీకి ప్రస్తుతం బాలీవుడ్‌లో సైతం వరస ఆఫర్లు ద‌క్కుతున్నాయి. ఇప్పటికే కార్తీక్‌ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇలాంటి క్రమంలో మరో బిగ్ జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందని.. బాలీవుడ్ బ‌డా స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుందంటూ ఇండస్ట్రీ వర్గాల‌లో వార్తలు వైరల్‌గా మారుతున్నాయి.

How much is Sreeleela getting paid for Pushpa 2 item song?

విషయంపై మూవీ యూనిట్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుందట. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు బాబి డియోల్ మెర‌వ‌నున్నార‌ని సమాచారం. ఈ ముగ్గురు స్టార్స్ కలయికలో ఓ సినిమా అంటే.. ఆడియన్స్‌లో కచ్చితంగా మంచి హైప్‌ నెలకొంటుంది. ఇక.. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఇక శ్రీలీల‌కు డ్యాన్స్, గ్లామర్, నటన.. ఇలా అన్నింటిలోనూ మంచి పట్టు ఉంది. ఇప్పటికే పుష్ప 2తో తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. అదిరిపోయే స్టెప్పులతో నార్త్ ఇండియాను షేక్ చేసింది. రోజురోజుకు ఆమె పాపులారిటీ అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. వరుస‌ ఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయి.

Exclusive: Sreeleela Joins Ranveer Singh and Bobby Deol for a Mega Project  | Filmfare.com

రణ్‌వీర్ సింగ్, బాబి డీయోల్, శ్రీ‌లీల‌ నటించబోయే ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కనుందట. ఇందులో యాక్షన్, డ్రామా పుష్కలంగా ఉండనున్నాయని సమాచారం. మంచి డిమాండ్ ఉన్న ఇలాంటి బడా స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం అంటే.. టైటిల్ కూడా అనౌన్స్ కాకముందే సినిమాపై భారీ బ‌జ్ మొద‌లైంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోగా రణ్‌వీర్‌ వరస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఇటీవల ఆయన నుంచి దురందర్‌ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. డాన్ 3 సినిమాలో కూడా రణ్‌వీర్ మెరవనున్నాడు. ఈ సినిమాలతో పాటు.. శ్రీ‌లీల‌తో కొత్త సినిమా అంటూ వార్తలు రావడం ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతున్నాయి.