కోట శ్రీనివాస్ 18 ఏళ్లు ఎదురుచూస్తున్న తీరని ఏకైక కోరిక అదే..!

టాలీవుడ్ విలక్షణ నటుడిగా తెలుగులో తిరుగులేపి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నా కోట శ్రీనివాస్.. 1978లో చిరంజీవితో కలిసి తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి మొదలుకొని.. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన చివరి శ్వాస వరకు కూడా ఇండస్ట్రీలో పని చేశాడు. సుమారు 750 కి పైగా సినిమాలో నటించిన ఆయన.. ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన నటించి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోట తన ప్రతిభకు పద్మశ్రీ, నంది పురస్కారాలను సైతం దక్కించుకున్నాడు.

అయితే తన 40 ఏళ్ల కెరీర్‌లో కోటాకు తీరని ఓ కోరిక ఉందట. దానికోసం ఆయన 18 ఏళ్లపాటు ఎంతగానో పరితపించినా.. అది నెరవేరలేదు. ఇంతకీ ఆయన జీవితంలో నెరవేరని ఆ ఏకైక కోరిక ఏంటంటే.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తో కలిసి నటించాలనుకోవడమే. తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక్కసారైనా చిన్న పాత్రలోనైనా నటించాలని ఎంతగానో ఆరాటపడేవాడట. కోట ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 18 ఏళ్ల పాటు ఆయన ఈ అవకాశం కోసం ఎదురు చూశాడు.

Kota Srinivas Rao Demise: కోటాను చుట్టుముట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!

అయినా ఈ కోరిక మాత్రం నెరవేరలేదు. కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి ఎన్టీఆర్ ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తర్వాత వ‌చ్చినా కేవలం మూడు, నాలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. ఇక ఆ సినిమాల్లోనూ కోటకు ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రాలేదు. ఎంతగానో పరితపించిన కోటకు ఎట్టకేలకు ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన‌ మేజర్ చంద్రకాంత్ సినిమా కోసం పిలుపు వచ్చింది. కానీ.. అప్పటికి ఆయన బిజీ ఫెడ్యూల్స్ తో ఉండడంతో ఈ అవకాశం కూడా మిస్ అయిపోయింది. చివరకు మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ చివ‌రి మూవీ కావడంతో కోట కోరిక తీరకుండానే మిగిలిపోయింది.