నందమూరి ఫ్యాన్స్ కు మైండ్‌ బ్లాక్‌.. అఖండ 2 ఇక లేనట్టేనా..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్లుగా నిలుస్తున్నాయి. అయితే.. ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలయ్యకు అఖండ సినిమాతో జైత్రయాత్ర ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌లతో వరస సక్సస్‌లు అందుకున్న సంగ‌తి తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం తన లక్కీ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై బాలయ్య అభిమానులే కాదు.. ఇతర హీరోల అభిమానుల సైతం ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి శ్రీను కూడా భారీ లెవెల్లో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో సినిమా ఆగస్టు నెలలో పూర్తవనుందని సమాచారం.

BALAKRISHNA - BOYAPATI SREENU REUNITE FOR 'AKHANDA 2' – *HINDI* TEASER OUT  NOW – 25 SEPT 2025 RELEASE… Ahead of #NandamuriBalakrishna's birthday on 10  June 2025, the makers of #Akhanda2: #Thaandavam ...

కాగా.. బాలయ్య పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లో సైతం సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి బాలయ్య అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో అభిమానులకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. మొదట అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌న సినిమా రావడం కష్టమే అంటూ టాక్‌ నడుస్తుంది. షూటింగ్ పూర్తవడానికి ఆగస్టు రెండో వారం వరకు సమయం పడుతుందట. దానికి తోడు.. విఎఫ్ఎక్స్ వర్క్, కంటెంట్ వర్క్ బోలెడంత బ్యాలెన్స్ ఉండిపోయిందని.. అవన్నీ పూర్తి చేసుకోవడానికి ఎంత కష్టపడినా రెండు నెలల సమయం పడుతుందని అంటున్నారు. మరోపక్క ఇదే డేట్ న పవన్ కళ్యాణ్ ఓజి సినిమా రిలీజ్ కానుంది.

Akhanda 2 - Thaandavam': Release date of Nandamuri Balakrishna's film with  Boyapati Sreenu announced - The Hindu

ఇప్పటికే సినిమా ధియేట్రిక‌ల్‌, నాన్ ధియేట్రిక‌ల్‌ రైట్స్‌ సైతం భారీ లెవెల్లో అమ్ముడయ్యాయి. అయితే.. అఖండ 2కి కనీసం ఓటీటీ బిజినెస్ కూడా పూర్తి కాలేదు. దీంతో సినిమా రిలీజ్ అధికారికంగా వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మేకర్స్ కూడా ఈ సినిమా దసరాకు తీసుకు రావడం కష్టమేనని.. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కనుక‌ సినిమా దసరాకు రిలీజ్ కాకుంటే.. దాదాపు డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుందని.. అప్పుడు కూడా సాధ్యం కాకపోతే వచ్చేయడాది సంక్రాంతి బరిలో అఖండ 2 పోటీ పడుతుందని అంటున్నారు. ఇక గతంలో.. బ్లాక్ బస్టర్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన అఖండ డిసెంబర్‌లోనే రిలీజ్ అయింది. పుష్పా సైతం డిసెంబర్ లోనే తెరకెక్కి సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఇక పుష్ఫ 2 డిసెంబ‌ర్‌లో వ‌చ్చి ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో చూశాం. ఈ క్రమంలోనే అఖండ 2 డిసెంబర్‌లో రిలీజై.. బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మాత్రం.. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి.. అది ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో వేచి చూడాలి.