కెరీర్‌లో తొలిసారి అల్లు అర్జున్ అలాంటి సాహసం.. అన్ని తానే..!

టాలీవుడ్ ఐరాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్స్ సక్సెస్ అందుకున్న తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నార. హీరోయిన్గా దీపిక పద్దుకొనే మెర‌వనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా ప్రారంభించారు టీం. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

ఇప్పటివరకు అల్లు అర్జున్ తన సినీ కెరీర్‌లో చేయని ఓ క్రేజీ సాహసాన్ని ఈ సినిమా కోసం చేయబోతున్నాడట. తన 21 సినిమాల్లో ఒక్కసారి కూడా ఆయన డ్యూయల్ రోల్‌లో నటించింది లేదు. కానీ.. అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలో మెరువనున్నడట. అది కూడా.. తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా ఆయన కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది.

Allu Arjun - Atlee Movie: Two Big Actresses to Shine?

ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ నాలుగు రోల్స్ లో ఎలా కనిపిస్తాడో.. అన్ని పాత్రలను ఎలా మేనేజ్ చేస్తాడో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక అట్లీ, బన్నీ సినిమాల్లో దీపికా న‌దుకొనేతో పాటూ మరో ఇద్దరు హీరోయిన్‌లుగా మృణాల్ ఠాగూర్, రష్మిక మందన మెర‌వ‌నున్నార‌ట‌. ఇక హాలీవుడ్ నటుడు ఈ సినిమాలో విలన్‌గా క‌నిపించ‌నున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంతో.. అబద్ధాం ఎంతో తెలియాలంటే మాత్రం మేకర్స్ డీటెయిల్ క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.