పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు పవన్ ను వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో.. దాదాపు అన్నిచోట్ల వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు మేకర్స్.
అయితే.. తాజాగా యూఎస్ఏ లో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ తో పవన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అమెరికాలో మూవీ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ పై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వీరమల్లు యూఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ లో 1,5,329 డాలర్లు బిజినెస్ జరిగిందట. ఇక 285 లోకేషన్లో 736 షోలకు.. ఏకంగా 3791 టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. సాధారణంగా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ కూడా ఈ రేంజ్లో జరగడం అరుదు.
కానీ.. వీరమల్లు విషయంలో ఈ రికార్డ్ ప్రారంభంలోనే బ్రేక్ చేశాడు పవన్. అయితే.. వీరమల్లు విషయములో ప్రస్తుతం ఇది ప్రారంభం మాత్రమే అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ వేగంగా పుంజుకుంటున్న క్రమంలో.. రాబోయే రోజుల్లో సినిమా బిజినెస్ మరింత జోరుగా జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చెన్నై లాంటి ప్రదేశాలలో రిగల్ లాంటి.. పెద్ద థియేటర్లలో ఇంకా పూర్తిస్థాయి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అక్కడ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తే కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.