నాని ” ఎల్లమ్మ ” సినిమా అందుకే రిజెక్ట్ చేశాడు.. దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్‌రాజుకు.. ఫ‌స్ట్‌ హాఫ్ ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమాతో ఏడది ప్రారంభించిన ఆయన ఈ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఎదుర్కున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకొని గేమ్ ఛేంజర్‌తో వచ్చిన నష్టాలు నుంచి తప్పించుకున్నాడు. దిల్‌రాజు సేపయ్యాడు అనుకునే లోపే మళ్ళీ తమ్ముడు సినిమాతో డిజాస్టర్. నితిన్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రూ.70 కోట్లకు పైగా బడ్జెట్ అయింది. నాప్‌ ధియేట్రిక‌ల్‌ రైట్స్ నుంచి కొంతమేర రికవరీ అయిన.. థియేట్రికల్ ప‌రంగా 10% రికవరీ కూడా ద‌క్కించుకోలేకపోయాడు. ఇలా ఏడాది ఫస్ట్ ఆఫ్ అంత వరుస ఫ్లాప్‌లతో బాగా డౌన్ ఫాల్ అయిపోయారు దిల్ రాజు.

Dil Raju announces Yellamma - Telugu360

ఇక ఇలాంటి క్రమంలోనే దిల్‌రాజు లేటెస్ట్ ఫోడ్‌కాస్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దిల్ రాజు నెక్స్ట్ నితిన్ తో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అదే ఎల్లమ్మ. బలగం వేణు డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయింది. షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించడమే ఆలస్యం అయితే.. ఇప్పుడు తమ్ముడు ఫ్లాప్‌తో ఎల్లమ్మ సినిమా ఎంతవరకు వర్క్ అవుతుంది అనే దానిపై దిల్‌రాజు విశ్లేషణ ప్రారంభించాడట. మరోసారి స్క్రిప్ట్‌ను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అయితే.. తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎల్లమ్మ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ముందుగా ఈ స్క్రిప్ట్‌ న్యాచురల్ స్టార్ నాని వద్దకు వెళ్లిన ఈ సినిమా ఆయన ఎందుకు రిజెక్ట్ చేశాడో చెప్పుకొచ్చాడు.

Yellamma Movie updates: 'ఎల్లమ్మ' చిత్రం ఇక లేనట్టేనా..? - OkTelugu

దిల్ రోజు మాట్లాడుతూ ముందు నానిని అనుకున్నాం. కానీ.. ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ తో సినిమా చేయలేనని చెప్పేశారు. ఇప్పుడు పారడైజ్ చేస్తున్నారు. కనుక ఈ సినిమా అయ్యాక చేస్తాను అన్నారు. అంతవరకు ఆగలేక నితిన్ ని సినిమాలోకి తీసుకున్నాం. ఇక టైటిల్ ఎల్లమ్మ అని ఉండడంతో చాలామంది హీరోలు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అనుకొని ఒప్పుకోలేదు. నేను వేణుకి చెప్పా.. ఈ ప్రాజెక్టుని హీరోలు ఒప్పుకోవడం అంత సులభం కాదు.. కానీ నువ్వు టైటిల్ మార్చడానికి వీల్లేదు. నువ్వు చెప్పిన కథకు ఎల్లమ్మ టైటిల్ పర్ఫెక్ట్. దాంతోనే మనం కథని తీయాలి అని చెప్పానంటూ వివరించాడు. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. తమ్ముడు స్క్రిప్ట్ కూడా ముందుగా నాని చేయాల్సి ఉందట. కానీ.. ఆయనకు స్క్రిప్ నచ్చకపోవడంతో స్టోరీని రిజెక్ట్ చేశాడు.