మెగాస్టార్ – బుల్లి రాజు సీన్స్ లీక్.. ఇక థియేటర్లో నవ్వుల పండగే..!

ప్రస్తుత కాలంలో బాగా వైరల్ గా మారుతున్న పేరు బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ చిన్నోడు ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. వెంకటేష్ కొడుకు పాత్రలో ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, కామెడీ డైలాగ్స్‌తో ఆడియర్స్‌ను ఫిదా చేశాడు బుల్లిరాజు. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడు అంటే.. ప్రస్తుతం సినిమాలో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కావాలంటే.. కచ్చితంగా బుల్లిరాజు ఫస్ట్ ఛాయిస్ అయిపోయేంతలా సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మరో బిగ్ స్టార్ హీరో అయినా చిరంజీవితో నటించే ఛాన్స్ కొట్టేసాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లోనే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బుల్లిరాజు ఓ కీలక పాత్రలో మెరవనున్నాడు.

Child Artist Revanth alias Bulli Raju and Venkatesh Hilarious Fun On Stage  | Manastars - YouTube

తాజాగా.. ఈ సినిమా సెట్స్‌లో చిరంజీవితో పాటు.. బుల్లిరాజు ఉన్న ఓ సీన్ పిక్ లీక్ అయింది. ప్రస్తుతం ఆ పిక్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇందులో.. బుల్లిరాజు, మెగాస్టార్ చిరంజీవి నవ్వుతూ సీన్ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే పిక్ పై నెటిజన్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీళ్ళ కాంబోలో సీన్స్ అంటే థియేటర్లో నవ్వుల పండగలా ఉంటుందంటూ.. కచ్చితంగా సినిమా ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే వెంకటేష్‌తో బుల్లిరాజు కామెడీని తెగ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూట్ పూర్తి చేస్తారా.. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తి చూపుతున్నారు.

Cinema: బుల్లి రాజు- మెగాస్టార్ సీన్ లీక్.. థియేటర్ లో నవ్వులే నవ్వులు

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాహో గారపాటి, చిరు కూతురు సుస్మిత కొణిద‌ల నిర్మిస్తున్న ఈ సినిమాల్లో.. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. చిరంజీవి తన సొంత పేరు శివశంకర వరప్రసాద్ రోల్‌లో మెర‌వ‌నున్నాడు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా కామెడీ పాత్ర‌లో వింటేజ్‌ చిరుని మరోసారి చూడబోతున్నామంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడట. ఈయన పాత్ర ఆడియన్స్‌ను మరింతగా నవ్వించనుందని.. స్వయంగా ఓ ఇంట్లో వెంక‌టేష్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్‌లో శ‌ర‌వేగంగా జరుగుతుంది.