లేటెస్ట్ ఫెసిలిటీస్ తో రవితేజ మల్టీప్లెక్స్ రెడీ.. ఆ స్టార్ హీరో మూవీతో ఓపెనింగ్..!

స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న చాలామంది సెలబ్రిటీస్ కేవలం నటినట్లుగానే కాకుండా.. ఇతర రంగాల్లోనూ సత్త చట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది వివిధ రకాల బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. అలా.. మన టాలీవుడ్ స్టార్ హీరోలలోనూ కొంతమంది థియేటర్ బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. ఇప్పటికే మహేష్ బాబు.. ఏఎంబితో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టగా.. ఏఏఏతో అల్లు అర్జున్ హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇక విజయ్ దేవరకొండ ఏవిడిస్ పేరుతో మల్టీప్లెక్స్ రంగంలోరి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే ఏపీలోనూ ఈ మల్టీప్లెక్స్‌లు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Another Luxurious Theatre ART Cinemas Set to Open in Hyderabad |  cinejosh.com

అయితే.. తాజాగా ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి టాలీవుడ్ మరో స్టార్ హీరో.. మాస్ మహారాజ్‌ రవితేజ కూడా అడుగుపెట్టనున్నాడు. గతంలోనే ఏషియన్ సంస్థలతోపాటు.. ఒప్పందం కుదుర్చుకున్న రవితేజ ఓ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని ప్రకటించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన వనస్థలిపురంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే.. దాదాపు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నారని టాక్‌. ప్రస్తుతం ఇంటీరియల్ వర్క్ జరుగుతున్న క్రమంలో.. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్గా ప్రారంభించనున్నారట.

Hari Hara Veera Mallu to make history as the inaugural film at this brand  new multiplex?

 

కాగా.. ఈ మల్టీప్లెక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాతో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా జూలై 24న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో.. రవితేజ థియేటర్ ఓపెన్ అవుతుందని సమాచారం. కాగా ఈ ఏఆర్‌టి మల్టీప్లెక్స్ ను లేటెస్ట్ సదుపాయాలన్నింటితో.. చాలా అద్భుతంగా నిర్మించినట్లు తెలుస్తోంది. సుమారు 57 అడుగుల వెడల్పుతో బిగ్ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే విధంగా టిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక‌ త్వరలోనే టాలీవుడ్ ప్రముఖులు గ్రాండ్గా ఈ మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తుంది.