టాలీవుడ్ నటుడు శివాజీ బిగ్ బాస్ షో తర్వాత మరోసారి పుంజుకున్నారు. ఈయన పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన శివాజి.. కెరీర్ బీనింగ్లో చిన్న చిన్న పాత్రల్లోను మెరిశాడు. తర్వాత సెకండ్ హీరోగా క్రమక్రమంగా ప్రధాన పాత్రలో నటిస్తూ వచ్చాడు. ఇక కొంతకాలానికి ఇండస్ట్రీలో బ్రేక్ పడింది. దీంతో అడపా.. దడపా.. రాజకీయాల్లో కనిపించినా.. చాలాకాలం తర్వాత బిగ్బాస్ తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు.
బిగ్ బాస్ గేమ్ షోలో.. శివాజీ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చి వెంటనే.. 1990 స్ కిడ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్ట్ సినిమాలో మంగపతి అనే నెగటివ్ రోల్ లో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆయన మంగపతి లాంటి పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టాడని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. తాజాగా మరోసారి అంతకుమించిపోయే రోల్‌లో ఒక క్యారెక్టర్ లో శివాజీ నటించేందుకు సిద్ధమయ్యాడట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. అక్కినేని అఖిల్. అక్కినేని అఖిల్ నటిస్తున్న నయా మూవీలో శివాజీ కీలక పాత్రలో మెరవనున్నాడట. మరోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని కోర్టులో.. మంగపతి రోల్ ను మించిపోయే రేంజ్‌లో ఈ పాత్ర ఉండబోతుందని సమాచారం దీనిపై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రానుంది. అఖిల్.. లెరిర్ మూవీలో శివాజీ ఛాన్స్ అందుకొని.. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం శివాజీ మరోసారి టాలీవుడ్ లో బిజీ అవుతాడు అనడంలో సందేహం లేదు.