బాహుబలి @10: అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాల్లో బాహుబలి కూడా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక నేటితో బాహుబలి ది బిగినింగ్ రిలీజై ప‌దేళ్లు పూర్త‌వ‌డం విశేషం. 2015 జూలై 10న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రభాస్‌కు ఒక్కసారిగా పాన్ ఇండియ‌న్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభాస్ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి పాన్ ఇండియ‌న్ స్టార్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. అయితే.. మొదట ఈ సినిమాను ఒకే భాగంగా రిలీజ్ చేయాలని భావించినా.. భారీ కథ, విజువల్ స్కేల్స్ ఎక్కువగా ఉండడంతో సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేశారు.

Baahubali - Sacnilk

కాగా.. ఇప్పుడు పదేళ్ల యానివర్సరీ సందర్భంగా సినిమాను మరోసారి థియేటర్లోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఇది రీ రిలీజ్ కాదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అయ్యు భారీ వసూళ్లు కొల‌గొడుతున్నాయి. అయితే.. రాజమౌళి మాత్రం రీ రిలీజ్ కాకుండా.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజ‌న్ రెండు భాగాలను కలిపి ఒక్కటే సినిమాగా రిలీజ్ చేయడానికి రాజమౌళి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమాను బాహుబలి ఎపిక్ టైటిల్‌తో రిలీజ్ చేయనన్నారు.

Baahubali: The Beginning | JH Wiki Collection Wiki | Fandom

ఈ సినిమా.. ఈ ఏడాది అక్టోబర్ 31 థియేటర్లో గ్రాండ్‌గా రానుంది. మొదటి భాగం రెండు భాగాన్ని కలపాలంటే కత్తెరకు మళ్ళీ పని చెప్పాలి.. రెండు పార్ట్‌లను ఒక సినిమాగా చేయడానికి కొన్ని సీన్లను కట్ చేసేయాలి. కొన్ని ఫైట్ సీన్స్ తీసేయాలి. ఎవరి స్క్రీన్ టైమ్ ఎంత ఉంటుంది.. ఎన్ని సాంగ్స్ ఉంటాయి.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఆడియన్స్ మధ్యలో మెదులుతూ ఉంటాయి. దాంతో.. ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. అయితే.. ప్రభాస్ బర్త్డే అక్టోబర్ 3న కాకుండ.. అక్టోబర్ 31న బాహుబలి రిలీజ్ చేస్తున్నారు. అదేదో ప్రభాస్ బర్త్డే రోజు రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అంటూ రెబల్ స్టార్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసినా.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.