తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తిరుగులేకుండా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. కాళీ దొరికినప్పుడల్లా సినిమా సెట్స్ళక్ష పాల్గొంటూ సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక పవన్ కళ్యాణ్‌కు ప్రస్తుతం సీనియర్ హీరోలుగా దూసుకుపోతున్న అందరి హీరోల కంటే ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులకు కంటతడి పెట్టిస్తుంది. అసలు పవన్ ఎమోషనల్ పోస్ట్ చేయడమేంటి.. ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ధర్శకధీరుడు రాజమౌళి పెదనాన్న, ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తండ్రి అయిన శివశక్తి దత్త మరణించిన సంగతి తెలిసిందే. మణికొండ లోని తన నివాసంలో.. సోమవారం రాత్రి ఆయన మరణించాడు. శివశక్తి దత్త వయసు ప్రస్తుతం 92 ఏళ్లు. కాగా అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు.
తెలుగు సాహిత్యం.. గీతా రచన.. ఇతర కళల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన లేకపోవడం.. ఇండస్ట్రీకి తీరనిలోటు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా శాంతి చేకూరాలని కోరుకుంటూ పోస్ట్లు పంచుకున్నారు. ఈ మూమెంట్ లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త గారి మరణంతో చింతిస్తున్న. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కలల సాహిత్యం పై ఎంతో అభిమానం కల శివశక్తి దత్త తెలుగు సాంస్కృతిక సాహిత్యాలపై పట్టున్న వ్యక్తి. ఎన్నో సినిమాలకు గీత రచయితగా వ్యవహరించారు.
శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం…
— JanaSena Party (@JanaSenaParty) July 8, 2025
తండ్రి మరణంతో కృంగిపోతున్న కీరవాణికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న అంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా తన పోస్ట్‌ను పంచుకున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఎప్పుడు ఛలాకిగా ఉండే కీరవాణి అంతలా కృంగిపోవడం చూసి బాధపడుతున్నారు. ఇక శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు గారు. రాజమహేంద్రవరం సమీపంలో కొవ్వూరులో ఆయన 1932 అక్టోబర్ 8న జన్మించారు. మొదటినుంచి కలలపై ఆసక్తితో కమలేష్ అనే కలం పేరుతో చిత్రకారుడుగా పనిచేసిన ఆయన.. తర్వాత సంగీతంపై మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం లాంటి ఇన్స్ట్రుమెంట్లపై పట్టు సాధించి.. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.