కింగ్‌డ‌మ్ టు వార్ 2.. టాలీవుడ్ లో నాగవంశీ సందడి షురూ..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా నాగ‌వంశీ తెలుగులో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే మరికొన్ని సినిమాల హక్కులను సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూటర్ గా దూసుకుపోతున్నాడు. అలా.. ఇప్పటికే టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి లాభాలను కొల్లగొట్టడు. ఇప్పుడు మళ్లీ తారక్ వార్ 2 సినిమాను కళ్ళు చెదిరే రేంజ్‌కు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టులో కూలీ వర్సెస్ వార్ 2 బాక్స్ ఆఫీస్ వార్ మొదలవుతుంది.

ఈ రెండు సినిమాల పై ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. ఈ క్ర‌మంలోనే సినిమాలు మధ్య గట్టి పోటీ ఉండ‌నుంది. ముఖ్యంగా తెలుగులో థియేటర్ల విషయంలో వార్‌ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమానే కాదు.. జూలై నుంచే నాగ వంశీ సందడి.. టాలీవుడ్‌లో మొదలైపోతుంది. 31న కింగ్ డ‌మ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు నాగవంశీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీ రేంజ్‌లో హైప్ నెలకొంది. ఈ సినిమా రెండు వారాలు బాగానే నడుస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక.. ఈ సినిమా సందడి పూర్తయిన వెంటనే.. మళ్ళీ ఆగస్టు 14న వార్ 2 సినిమాతో ఆడియన్స్ పలకరించినన్నారు.

అసలే ఆయన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ సినిమా. కనుక రిలీజ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా థియేటర్ల విషయంలో తగ్గకుండా నాగ వంశీ చూసుకుంటాడు అనడంలో సందేహం లేదు. ఇక మర పక్కనే సినిమాకు పోటీగా వస్తున్న కూలి సినిమా కూడా భారీ లెవెల్లో బిజినెస్ జరుపుకుందట‌. దాదాపు రూ.40కోట్ల‌తో దిల్ రాజు, ఏషియ‌న్ సునీల్, సురేష్ బాబు సంయుక్తంగా ఈ హ‌క్కులు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇక తారక్ వార్ 2 సినిమాకు రూ.100 కోట్లు డిమాండ్ చేసిన మేకర్స్ ను.. రూ.80 కోట్లకు ఒప్పించి డిస్టిబ్యూషన్ హక్కులను నాగ వంశీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలను తెచ్చి పెట్టాలంటే కచ్చితంగా రూ.200 కోట్ల గ్రాస్ వ‌సుళ్ల‌ను కొల్లగొట్టాల్సి ఉంది. ఇక తారక్, హృతిక్, కియార ల క్రేజ్‌తో ఈ రేర్ ఫీట్ సాధిస్తుందో లేదో చూడాలి.