టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాలున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎట్టకేలకు స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్తో ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. అంతవరకు బానే ఉన్నా.. అసలు టెప్షన్ ఇప్పుడే మొదలైంది. సినిమాకు మంచి మార్కెట్ రావాలి.. ఆ మార్కెట్ కు తగ్గ రేంజ్ లో సినిమా ప్రమోషన్స్ ఉండాలి. ఈ పనిలోనే మేకర్స్ బిజీ అవుతున్నారట.
ఇక రత్నం చెబుతున్న రేట్లు భారీ లెవెల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా వీటికి సంబంధించిన బిజినెస్ లెక్కలు వైరల్ గా మారుతున్నాయి. నైజం ఏరియాకు రూ.65 కోట్లు, సిడెడ్ మినహా.. ఏపీకి రూ. 7.80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట రత్నం. వైజాగ్ ఏరియాకు లీడింగ్ బయ్యర్లను సంప్రదించి రూ.80 కోట్ల మేరా కోడ్ చేస్తున్నాడట. అంటే.. కేవలం ఉత్తరాంధ్రకే రూ.20 కోట్ల వరకు అవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. చాలా పెద్ద స్టంట్. సినిమాకు హిట్ టాక్ వస్తే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రైలర్ ప్రకారం సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎప్పుడు సినిమాకు ఉంటుంది. అని బానే ఉన్నా.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రెండు వారాల్లో సినిమా రిలీజ్ ఉంది. కనుక ఈ వారంలోనే పూర్తి బిజినెస్ ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
ఇక సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేయడం పవన్ కుదరదు. రత్నం, జ్యోతి కృష్ణ, నీధి అగర్వాల్ అయినా కచ్చితంగా ప్రమోషన్స్‌లో అందుబాటులో ఉండాలి. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా కీలకం, అవన్నీ రెండు వారాల్లో ముగించాల్సి ఉంటుంది, సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే తమవంతుగా సహాయం చేస్తూ,, సినిమాపై క్రేజ్ ను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు,, వారికి ప్రమోషన్స్ కోసం మరింత కంటెంట్ ను టీం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఈ మార్కెట్ లెక్కల తో పాటు,, ప్రమోషనల్ విషయంలోనూ రత్నం స్పీడ్ పెంచాలి. సినిమా పనులు జ్యోతి కృష్ణ చూసుకున్నా.. ఇతర విషయాలన్నింటినీ రత్నం డీల్ చేయాలంసి ఉంది. మరి సినిమా ప్రమోషన్ల విషయంలో ఆయన స్ట్రాటజీ ఎలా ఉందో.. ఏం చేయబోతున్నాడో.. సినిమా రిలీజ్ కి ముందే ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.