జాక్‌పాట్ కొట్టేసిన కోర్ట్ బ్యూటీ.. కోలీవుడ్ మూవీలో శ్రీ‌దేవి కి ఛాన్స్‌..!

నాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి చివరగా తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ కోర్ట్. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాల్లో యంగ్ హీరో, హీరోయిన్లుగా హర్ష రోష‌న్‌, శ్రీదేవి నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు వీళ్ళిద్దరూ వరుస ఆఫర్లను అందుకుంటు బిజీ స్టార్స్ గా మారుతున్నారు. ఇప్పటికే హర్ష రోషన్ పలు సినిమాల్లో బిజీ అయ్యిపోయాడు.

ఇక తాజాగా కాకినాడ సోయ‌గం.. శ్రీదేవి సైతం ఓ తమిళ్ సినిమాలో నటించే జాక్పాట్లు కొట్టేసింది. తమిళ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్‌ నటుడు.. కేజేఆర్ రెండవ సినిమాలో శ్రీదేవి న‌టించ‌నుంది. తాజాగా.. ఈ సినిమాను పూజ కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్ లో ప్రారంభించారు మేక‌ర్స్‌. ఇక ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. శ్రీ‌దేవి హీరోయిన్గా మెర‌వ‌నున్న నేప‌ద్యంలో పూజా కార్యక్రమాల్లో సందడి చేసింది. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని సందడి చేశారు.

వారిలో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఉండడం విశేషం. కాగా.. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను రేగన్ స్థానిక్‌లాస్ డైరెక్ట్ చేస్తుండగా.. గిబ్రాన్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. ఫస్ట్ సినిమాతోనే తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న మ‌న‌ తెలుగు అమ్మాయి శ్రీదేవి.. కోలీవుడ్‌లోను త‌న నెక్స్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.