టాలీవుడ్ స్టార్ బ్యూటీ వర్ష బొల్లమ్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్, ఊరు పేరు భైరవకోన, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం తదితరు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ అమ్మడు.. తాజాగా తమ్ముడు సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించింది. నితిన్ నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ ప్రధాన హీరోయిన్ కాగా.. మరో ఫిమేల్ లీడ్ రోల్లో వర్ష బొల్లమ్మ మెరిసింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. యావరేజ్ టాక్ వచ్చినా.. వర్షా బొల్లమా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ సినిమా ప్రమోషన్స్‌లో వర్షా తన సర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
అలా.. తన ఇష్టం గురించి ఆమె మాట్లాడుతూ.. తను టాలీవుడ్ స్టార్ హీరో నటించిన ఓ సినిమా ఏకంగా 50 సార్లు చూసారంటే చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు మాస్ మహారాజు రవితేజ. రవితేజ హీరోగా విక్రమార్కుడు సినిమా వచ్చి ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఇక ఈ సినిమాను అయితే వర్ష బొల్లమ్మ ఏకంగా 50 సార్లు చూసిందట. ఈ విషయాని తను స్వయంగా వెల్లడిస్తూ.. నిజంగా నేను జోక్ చేయడం లేదు.. అప్పట్లో సమ్మర్ హాలిడేస్ 60 డేస్ వచ్చినప్పుడు.. 50 డేస్ మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న. అక్కడ నా కజిన్ సిస్టర్ ప్రతిరోజూ విక్రమార్కుడు సినిమా చూసేది.
అప్పట్లో డివీడిలు ఉండేవి. ఈ క్రమంలోనే క్యాసెట్ వేసుకొని దాదాపు నేను ఉన్నన్ని రోజులు అంటే 50 రోజులు ఆమెతో కలిసి నేను అదే సినిమాను చూశా. నా కజిన్ సిస్టర్ కు ఆ సినిమా సాంగ్స్ అన్న.. హీరో అన్న పిచ్చి.. దాంతో మొత్తం సినిమా ప్రతిరోజు చూసేది. ఒకవేళ వేయకపోతే ఆరోజు ఆమెకు చాలా కోపం వచ్చేది. దీంతో చేసేదేమీ లేక మేము కూడా ప్రతిరోజు విక్రమార్కుడు సినిమా చూసే వాళ్ళం. అప్పట్లో నాకు తెలుగు ఎక్కువగా వచ్చేది కాదు.. అయినా కూడా ఆ సినిమాలో డైలాగ్స్ అని నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. విక్రమార్కుడు 2,3 సార్లు చూశాక చాలా అద్భుతంగా ఫీలయ్యా అంటూ పంచుకుంది.