క్రేజీ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనుంది. కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ, వర్ష బొల్లమా, సీనియర్ బ్యూటీ లయ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా రేపు గ్రాండ్గా రిలీజ్ కానున్న క్రమంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను టీం ముగించారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ టీం తెలిపిన రివ్యూ.. నెటింట వైరల్ అవుతుంది. పవన్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్‌తో.. నితిన్ తమ్ముడు సినిమా ఆడియన్స్‌ను పలకరించునుంది.
రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించారు. సినిమా స్టోరీ మారుమూల గ్రామీణ ప్రాంతం.. అంబర గొడుగు బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. నితిన్ ఈ సినిమాలో విల్లు విద్య క్రీడాకారుడక కనిపించనున్నాడు. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు చిన్న పాప కోసం చేసే పోరాటం.. సెంటిమెంట్తో స్టోరీ రన్ అవుతుందట. అంబరగొడుగులో చిక్కుకున్న సోదరి, ఆమె కూతురుని హీరో ఎలా రక్షిస్తాడు.. అనేదే సినిమా స్టోరీ. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీ బజ్ నెలకొల్పింది. తమ్ముడు సినిమా కథ మొత్తం 80 శాతం అడవి ప్రాంతాల్లోని రూపొందించారు.
సినిమా విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ మరింత ప్లస్ అవ్వనున్నాయని.. అడవిలో జరిగే సన్నివేశాలన్ని.. ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన రోల్‌లో ఈ సినిమా చూడనున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈమె రియంట్రీతో ఎలాంటి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుందో చూడాలి. సభ్యులు కొన్ని సీన్స్ కట్ చేస్తే.. యు\ఏ సర్టిఫికెట్ ఇస్తామని.. లేదంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామని టీంకు సూచించినా.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మిగతా టీమ్ అంతా కలిసి ఏ సర్టిఫికెట్ జారీ చేసేయమని వెల్లడించారట. సినిమా రన్ టైం.. 2 గంటల 25 నిమిషాలు అయితే.. 1 గంట 45 నిమిషాల్లో రన్ టైం కుదించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రేపు రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.