సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసార్వభౌమ తారక రామారావుకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది నటీనటులకు ఆయన అభిమాన హీరో. అన్నగారు అన్నగారు అంటూ అంతా ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్‌ను చూసి ఇండస్ట్రీలో అప్పట్లోనే చాలామంది భయపడి పోయేవారు అంత కాదు కృష్ణలాంటి కొందరు స్టార్ హీరోస్ ఆయన్ని విభేదించి ఆయనను కోపగించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా.. సూపర్ స్టార్ కృష్ణ కాకుండా మరో సీనియర్ హీరో అయిన చంద్రమోహన్ కూడా ఓ సందర్భంలో ఎన్టీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. కారణం ఎన్టీఆర్ తనకు చేసిన అన్యాయమేమీ చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తప్పు అని తెలుసుకోకుండా.. ఎన్టీఆర్ చేసిన పని నన్ను బాధించిందని.. చంద్రమోహన్ వివరించాడు.
ఇంతకీ ఎన్టీఆర్.. చంద్రమోహన్‌కి అంతలా కోపం వచ్చే పని ఏం చేశాడు.. అసలు చంద్రమోహన్ చెప్పిన ఆ విషయాల ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1975లో ఎన్టీఆర్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడుగా మురళీమోహన్, నేను సెటక్ట్ అయ్యాం. ముందుగా ఓ సాంగ్ తో ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టారు. నేను సాంగ్ షూటింగ్ కోసం రిహార్సల్స్ కూడా చేశా.. తర్వాత రోజు సాంగ్ షూటింగ్ ఉంది. దీంతో ఉదయాన్నే షూటింగ్ కు వెళ్ళిపోయా. షూటింగ్‌కి వెళ్ళాక నాకు షాక్. నాలాగే.. మేకప్, కాస్ట్యూమ్స్ వేసుకొని ఓ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏదో తేడాగా జరుగుతుందని అనుమానం వచ్చింది. ఎవరా వ్యక్తి.. నాలాగే మేకప్ వేసుకుని ఉన్నాడు అని అడిగితే.. ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ అని అన్నారు.
నా అనుమానం మరింతగా పెరిగింది. ఏం జరిగింది.. ఎవరిని అడుగుతున్న సమాధానం లేదు. కొంతసేపటికి నిర్మాత పితామరం నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇంటికి వెళ్లిపోండి సాయంత్రం మీతో నేను మాట్లాడతా.. చిన్న పొరపాటు జరిగింది.. ఏం జరిగిందో మీ ఇంటికి వచ్చి నేనే చెప్తాను సార్ అని నన్ను పంపించేసాడు. ఆరోజు సాయంత్రం పీతంబరం నా దగ్గరికి వచ్చి.. చాలా పొరపాటు జరిగింది. ఎన్టీఆర్ గారు తన కొడుకు బాలకృష్ణను.. తమ్ముడుగా చూడాలనుకుంటున్నారు. చివరి నిమిషంలో మీ పాత్ర బాలయ్యకు ఇవ్వాల్సి వచ్చింది. ఎన్టీఆర్ గారికి నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాం. ఆయన బాలయ్యను నా తమ్ముడుగా తీసుకుంటున్న చంద్రమోహన్ గారికి.. ఇది నా మాటగా చెప్పండి.
నా నెక్స్ట్ సినిమాలో చంద్రమోహన్ గారికి మంచి గెటప్ ఇస్తా అని అన్నారు అని చెప్పాడు. దీంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. షూటింగ్ కి పిలిపించు మరి అవమానించడం ఎందుకు అని కోపగించుకున్నాడట చంద్రమోహన్. ఆయన సినిమా వేషం గీషం నాకేం వద్దు.. అసలు ఎన్టీఆర్ గారి పేరు నా ముందు వినపడడానికి వీల్లేదు అంటూ చంద్రమోహన్ మండిపడ్డాడట. ఇక అన్నదమ్ములు సినిమా షూట్ టయానికి నాకు ఒక క్రేజ్, పాపులారిటీ వచ్చింది. అంత పేరు వచ్చిన తర్వాత నన్ను అలా అవమానించడం నేను అసలు సహించలేకపోయా. అంతేకాదు.. ఆయన చెప్పినట్లు నాకేమీ తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇవ్వలేదు. టైం కి ఏదో ఒక మాట అనేసాడంతే.. ఆయన కొడుకుని తమ్ముడుగా చూడాలని కోవడం తప్పు కాదు.. కానీ ఆ పని ముందే చేయకుండా నన్ను షూటింగ్ వరకు రప్పించి అక్కడ అవమానించడం బాధనిపించింది అంటూ చంద్రమోహన్ చెప్పవచ్చాడు. ఆయన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారుతున్నాయి.