టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్‌తో మార్కెట్ ఆకాశానికి ఎదిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా ఎంతో మంది టాప్ స్టార్లుగా దూసుకుపోతున్న వారందరినీ దాటేసి మరీ.. బన్నీ టాప్ వన్ లో నిలిచాడు. తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ బన్నీ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం బిగ్ షాకింగ్. ఏళ్ల తరబడి బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న హీరోలతో పాటు.. సౌత్ లోనూ పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా రాణిస్తూన్న వారందరిలో ఫ్యూచర్‌లో బన్నీ బీట్ చేసే హీరో ఎవరు..? అనే ప్రశ్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ స్టార్ డమ్ బీట్ చేయడం ఇప్పట్లో కష్టమైనంటూ సంచల కామెంట్స్ చేశాడు ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్. అతను ఎవరో కాదు మధుర బండార్కర్. ఆయన సాదాసీదా దర్శకుడు కాదు. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు తో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం అల్లు అర్జున్ దక్కించుకున్న క్రేజ్‌ను ఇప్పట్లో ఏ హీరో కనీసం టచ్ కూడా చేయలేరంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
పుష్ప సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ పుష్ప రోల్ లో పరకాయ ప్రవేశం చేసి నటించిన అల్లు అర్జున్ ట్రాన్ఫర్మేషన్.. భారీగా మాస్‌ను ఆకట్టుకుందని.. ప్రాంతాలకు అతీతంగా అల్లు అర్జున్‌ను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారంటూ వివరించిడు. కేవలం మధుర్ మాత్రమే కాదు.. హృతిక్ రోషన్ సైతం పుష్ప సినిమాను అల్లు అర్జున్ మాత్రమే చేయగలడంటూ ప్రసంసించాడు.