టాలీవుడ్ స్టార్ట్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా గేమ్ ఛేంజర్ డిజాస్టర్ పై మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమా డిజాస్టర్. ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయింది అనుకున్నాం.. ఆ సమయంలో కనీసం దర్శకుడు, హీరో ఎవరు మాకు ఫోన్ కాల్ కూడా చేయలేదు అంటూ నిర్మాత సంచలన కామెంట్లు చేశాడు. దీనిపై చరణ్ అభిమానులు మండిపడ్డారు. అయితే నిర్మాత దిల్ రాజు.. శిరీష్ కామెంట్లపై సుదీర్ఘ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్‌రాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై రియాక్ట్ అయ్యాడు.
గత పది రోజులుగా గేమ్ ఛేంజర్ ప్రస్తావన లేకుండా అసలే ఇంటర్వ్యూ ఉండడం లేదు. శంకర్‌తో కలిసి నేను కూడా పని చేశా. శిరీష్ ఈ సినిమాకు సంబంధించిన పనులు చూడలేదు. ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎక్కువగా పని చేశాడు. కానీ.. ఎక్కడ కూడా చరణ్ గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆర్‌ఆర్ఆర్ తర్వాత చరణ్ మాకు డేట్స్ ఇచ్చారు. మేమిద్దరం మాట్లాడుకుంటూనే శంకర్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాం. ఇక శంకర్ ఇండియన్ 2.. సినిమా పనుల్లో బిజీ అయిపోయి గేమ్ ఛేంజర్ ఆపినా.. చరణ్ మాత్రం ఈ ప్రాజెక్టుకుస్టిక్ అయ్యి ఉన్నాడు. అప్పటికే.. నేను కూడా ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దానికి ముందుకు తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చా.
కానీ.. ప్రాజెక్ట్ విషయంలో చరణ్ కమిట్మెంట్‌తో పనిచేశారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ మ్యాటర్‌లో నేను ఏ ఇంటర్వ్యూలో చరణ్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. శంకర్ పెద్ద దర్శకుడు కావడంతో కొన్ని స్ట్రిక్ట్ కండిషన్లను తీసుకోలేకపోయాం. దీంతో షూటింగ్, షెడ్యూల్ పై క్లారిటీ లేకుండా పోయింది. అంతకంతకు ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అయినా.. చరణ్ ఓపికగా సినిమా పూర్తయ్యే వరకు సహకరించారు. ఇక ఏడాది సంక్రాంతికి మా బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పిన చరణ్, చిరు ఇద్దరు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాధారణంగా ఇలా రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ప్రభావం ఉంటుందని వద్దంటారు. కానీ అలా చేయలేదు.
రెండు రిలీజై సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక శిరీష్ గారి విషయానికి వస్తే.. ఆయన ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడరు. మొదటిసారి రియాక్ట్ అయ్యారు. సినిమాలకు సంబంధించి ఆయన డిస్ట్రిబ్యూషన్ కోణంలో మాత్రమే ఆలోచనలు చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే ఆయన అలా మాట్లాడాడు. ఇప్పుడు మీడియాలోనూ, ఫ్యాన్ సర్కిల్లోను ఆయన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆయన మాటలు వెనుక ఉద్దేశం మాత్రం అది కాదు. చరణ్‌తో శిరీష్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనపై వ్యాఖ్యలు చేసే ఉద్దేశం మాకు అసలు లేదు. ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చిన అనుభవం ఉంటే ఆయన దానికి తగ్గట్లుగా మాట్లాడేవాళ్లు. శిరీష్ మాట్లాడిన ఏదో నాలుగు మాటలని.. సోషల్ మీడియాలో చిన్న క్లిప్ గా ప్రచారం చేసేస్తున్నారు. ఎపిసోడ్ మొత్తం చూస్తే అన్నింటికీ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఇంటర్వ్యూస్‌లో నేను బ్యాలెన్స్ చేసినట్లు.. శిరీష్ చేయలేరంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దినరాజు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.