దివంగత అతిలోకసుందరి శ్రీదేవి.. టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూవలం టాలీవుడ్లోనే కాదు.. సౌత్, నార్త్ లోను తన సత్తా చాటుకున్న శ్రీదేవి.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం మనమధ్య లేకపోయినా.. ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. ఎన్నో ప్రశంసలని దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ స్టార్ హీరోయిన్.. బాలీవుడ్ బ్యూటీ పూనమ్ థీలాన్ మాట్లాడుతూ శ్రీదేవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా పూనమ్.. శ్రీదేవి గురించి మాట్లాడుతూ నేను తనతో పని చేశా. అందరూ అనుకున్నట్లు శ్రీదేవి తెలివి తక్కువ వ్యక్తి కాదు. ఆమె చాలా అందమైన.. అద్భుతమైన మనిషి అంటూ చెప్పుకొచ్చింది. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనమ్.. శ్రీదేవిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసింది. మీడియా శ్రీదేవిని మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసిందని.. కానీ తాను చాలా తెలివైన నటి అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి శ్రీదేవిని తాను తెలివైనది కాదు.. తను అమాయకురాలని ముద్ర వేయడం అంతా ఒక కుట్ర అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె అంత తెలివి తక్కువగా ఉంటే.. అంత అద్భుతమైన నటిగా ఎలా మారుతుంది.. అందుకే శ్రీదేవి అమాయకురాలని నమ్మడాన్ని నేను నిరాకరిస్తున్న. నేను ఎల్లప్పుడూ ఆమె పనితీరును ఆరాధిస్తా. తనతో కలిసి నేను రెండు సినిమాల్లో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి అంటూ పూనమ్ థిలాన్ గురించి వివరించింది. ఇక.. శ్రీదేవి, పూనమ్ థీలాన్ కలిసి.. సోనె పే సుహాగా, జుదాయి సినిమాల్లో నటించారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ అందుకున్న పూనమ్.. చివరిగా రితేష్ దేశ్ముక్, తమన్నా భాటియా జంటగా నటించిన ప్లాన్ ఏ ప్లాన్ బి.. లో మెరిసింది. జియో హాట్ స్టార్ లో దిల్ బేకరార్ లోను నటించి ఆకట్టుకుంది.