టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ బీమ్స్ సిసిరోలియోకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చివరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఈ సినిమా అంత సక్సెస్ అందుకోవడానికి ఒక కారణం మ్యూజిక్ కూడా అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాకు సైతం అనిల్.. బీమ్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడట బీమ్స్. ఇంతకీ.. ఆ మూవీ ఏంటో అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌లతో పని చేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మల్లిడి వశిష్టకు ఛాన్స్ ఇచ్చిన విశ్వంభర బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయితే.. ఒక్కసారి మాత్రమే బ్యాలెన్స్ ఉండడం.. అది కూడా స్పెషల్ సాంగ్ కావడంతో చిరుతో కలిసి పోటాపోటీగా చిందేసే ఓ స్టార్ బ్యూటీ కోసం హంటింగ్ మొదలెట్టాడు. ఓ పక్క ఈ సాంగ్ పూర్తి కాలేదంటే.. మరోపక్క విఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి కాకపోవడంతో వశిష్ఠతో పాటు.. మొత్తం టీమ్ అంత టెన్షన్ పడుతున్నారట. ఇక పరిస్థితి ఇలా ఉంటే.. సినిమా స్పెషల్ సాంగ్ సంబంధించిన ట్యూన్స్ కూడా ఇప్పటివరకు ఫైనల్ కాలేదని.. ఇన్సైడ్ వర్క్ నడుస్తుంది.
మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సాంగ్ కోసం కీరవాణి కొన్ని స్పెషల్ ట్యూన్స్ వినిపించినా.. అవేవీ అంతగా సెట్ కావడం లేదని.. మరింత కొత్తగా యూత్ లో జోష్ ని పెంచేలా ఉండడం కోసం.. ఈ సాంగ్ మ్యూజిక్ డిజైన్ చేయిలని భావించిన మేకర్స్.. ఓ యంగ్ డైరెక్టర్‌ను అప్రోచ్ అయితే మంచిదని భావిస్తున్నారట. ఈ క్రమంలోని సాంగ్ ట్యూన్ బాధ్యతలు బీమ్స్ కు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే బీమ్స్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీమ్స్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇందులో వాస్తవం ఏంతో తెలియాలంటే ఈ న్యూస్ అఫీషియల్‌గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.