టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత.. అట్లీ డైరెక్షన్‌లో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. చడీచప్పుడు లేకుండా పూజ కార్యక్రమాలను పూర్తిచేసిన టీం.. నిన్ననే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇదంతా బానే ఉంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కించాల్సిన మైథిలాజికల్ మూవీ సంగతేంటి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే ఆ సినిమా క్యాన్సిల్ అయిందని సమాచారం. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్ హ్యాండోవర్ చేసుకున్నారట. అలాగే.. గతంలో అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయిందంటూ టాక్ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్టులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నాడట.
ఇలా.. ఐకాన్ స్టార్ వరస ప్రాజెక్టులు రద్దు అవుతున్న నేపథ్యంలో.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా సినిమాలన్నీ క్యాన్సిల్ అవడం.. వరుస వివాదాల్లో సతమతమవుతున్న బన్నీ.. తాజాగా అసలు పెద్దగా పాపులారిటీనే లేని ఓ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ క్రమంలోనే.. బంగారం లాంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని వదిలేసి అల్లు అర్జున్ ఎందుకు ఇలాంటి రూట్లో వెళ్తున్నాడని అభిమానులు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అల్లు అర్జున్ మాత్రం మొదటినుంచి డైరెక్టర్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ కాదు కథలో కంటెంట్ ఉందా.. తన పాత్ర వర్కౌట్ అవుతుందా.. అనేదాన్ని ఆలోచించే దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళంలో ” బిసిల్ జోసఫ్ ” అనే ఓ టాప్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు.. సూపర్ సక్సెస్ అందుకున్నాయి.
అందులో ఓటీటీలో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న మిన్నల్ మురళి మూవీ కూడా ఒకటి. కఇక సూపర్ హీరో సినిమా అలాంటి తరహా కాన్సెప్ట్‌తోనే.. అల్లు అర్జున్‌తో బిసిల్ జోసఫ్ ఓ సినిమాను తీయడానికి సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాకు శక్తిమాన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. కేవలం ఒక్క సినిమాతో ఆగిపోకుండా.. పెద్ద సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నాడట బిసిల్ జోసఫ్. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో.. అట్లీతో సినిమా పూర్తి అయిన వెంటనే బన్నీ ఈ ప్రాజెక్టులో ఎలాంటి స్టంట్స్ చేయబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. మొదట ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ కపూర్‌తో చేయాలని భావించాడట. కానీ.. ఎందుకో ఆయన ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేయడంతో.. అల్లు అర్జున్‌ను అప్రోచ్ అయిన బిసిల్.. ఆయనతో గ్రీన్ సింగ్ ఇప్పించుకున్నాడని తెలుస్తుంది. త్వరలోనే.. ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన రానుందట. ప్రస్తుతం.. అట్లీతో చేస్తున్న మూవీ సూపర్ హీరో జోనర్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. చిన్నపిల్లల్లో ఎప్పటికీ చెరిగిపోని ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నాడా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.