ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ హీరోలు పోలీస్ పాత్రలో నటిస్తే.. అటు అభిమానులతో పాటు.. ఇటు ఆడియన్స్‌లోను కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. కాకి డ్రెస్ లో.. లాటి, తుపాకీ చేతబట్టి పోలీస్ ఆఫీసర్ రోల్లో హీరోలు పవర్ఫుల్ డైలాగ్ లు చెబుతుంటే.. విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే.. ధియేటర్లలో విజిల్స్ మోత మోగాల్సిందే. గూస్ బంప్స్ రావాల్సిందే. అంతేకాదు.. ఈ సినిమాల్లో పోలీస్ బ్యాక్ డ్రాప్ ఎవర్గ్రీన్ ఫార్ములా. కథ బాగుండి.. పాత్రలో దమ్ముంటే మాత్రం పోలీస్ సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యి.. సంచలనాలు సృష్టిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ క్రమంలోనే మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలామంది.. పోలీస్ ఆన్ డ్యూటీ అంటూ.. పోలీస్ పాత్రలో విజృంభించేందుకు రెడ్డీ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
రజనీకాంత్:
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ ఎలాంటి బ్లాక్ బాస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తు వెల్ పాండియన్ గా.. రజనీకాంత్ అదరగొట్టాడు. ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్‌గా జైలర్ 2 సినిమా రూపొందుతుంది. ఈ సినిమా స్టోరీ.. గోవా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందట. ఇక ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ గా.. ముత్తు వేల్ పాండియన్ గా మరోసారి రజినీకాంత్.. తన నటనతో ఆడియన్స్ ను ఖాయం అని తెలుస్తుంది.
ప్రభాస్:
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీ బిజీగా రానిస్తున్న సంగతి తెలిసిందే. 2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్.. దాదాపు రెండు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. కాగా.. ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా ప్రభాస్ కాకి డ్రెస్ లో.. పవర్ఫుల్ పాత్రలో కనిపించింది లేదు. ఎప్పటినుంచో ఆయన అభిమానులు సైతం ఈ పాత్ర కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు ఎట్టకేలకు చెక్ పడింది. స్పిరిట్ సినిమాతో పవర్ఫుల్ పోలీస్ ఆడియన్స్ ను పలకరించనున్నాడు ప్రభాస్. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగా స్వయంగా వెల్లడించాడు. ఇక ప్రభాస్ కు జంటగా తృప్తి దిమ్రి మెరువనుంది.
రవితేజ:
సీనియర్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీను వైట్ల డైరెక్షన్లో 2004లో వెంకీ సినిమాతో మొదటిసారి కాకి డ్రెస్ లో మెరిసిన రవితేజ.. కేవలం కొద్దిసేపు మాత్రమే పోలీస్ గెటప్ లో కనిపించాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో.. విక్రమ్ రాథోడ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో మెరిసాడు రవితేజ. ఈ సినిమాను ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేశారు. తర్వాత ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్ లాంటి సినిమాలతో పోలీస్ ఆఫీసర్‌గా తనదైన మేనరిజంతో సత్తా చాటుకున్నాడు రవితేజ. చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో సైతం ఎసిపి విక్రమ్ సాగర్ గా రవితేజ తను నటనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ఆడియన్స్ ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్లో రూపొందుతున్న.. మాస్ జాతర సినిమాతో.. మరోసారి రవితేజ పోలీస్ గెటప్ లో ఆకట్టుకొనున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మే 9న ఆడియన్స్ ను పలకరించనుంది.
పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీబిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో హరీష్‌శంకర్ డైరెక్షన్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్.. పోలీస్ ఆఫీసర్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా.. బాబి కొల్లి డైరెక్షన్ లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో సైతం మరోసారి కాకి డ్రెస్ లో నటించి ఆకట్టుకున్నాడు. కాగా ఇలాంటి నేపథ్యంలోనే మరోసారి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని కాకి బట్టలతో.. పవర్ ఫుల్ డైలాగ్స్ తో.. ఆడియన్స్‌ను ఆకట్టుకోనున్నాడట. ఈ సినిమాలో.. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. నవీన్ యార్నేవి, రవిశంకర్ యలమంచలి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.
కార్తీ:
హీరో కార్తీ 2022 లో హీరోగా చేసి బ్లాక్ బాస్టర్ అందుకున్న మూవీ సర్దార్. ఈ సినిమాల్లో కార్తీ డబల్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో.. తండ్రి, కొడుకుల పాత్రలో నటించగా.. తండ్రి పాత్రలో ఖైదీగా కనిపించిన కార్తీ.. కొడుకు పాత్రలో పోలీస్ ఆఫీసర్ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే.. సర్దార్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్గా సర్దార్ 2 రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో.. మరోసారి కాకీ బట్టల్లో పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆకట్టుకోనున్నాడు కార్తీ. 2026 సంక్రాంతి బరిలో.. ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ మూవీ హిట్ 4లోను.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ కనిపించనన్నాడు.
విజయ్ దేవరకొండ:
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననురి డైరెక్షన్లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై.. సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాల్లో.. మునుపేన్నడు కనిపించని ఓ వైవిద్యమైన రోల్లో స్పై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు విజయ్. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందట. మొదట భాగానికి కింగ్డమ్ అని పేరు పెట్టగా.. రెండో భాగానికి కింగ్డమ్ స్క్వేర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక.. కింగ్డమ్ పార్ట్ 1.. జూలై 4న ఆడియన్స్‌ను పలకరించనుంది.
విశ్వక్ సేన్:
టాలీవుడ్ క్రేజి హీరో విశ్వక్ సేన్ గతంలో హిట్ సినిమాతో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అయితే.. తాజాగా విశ్వక్ మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీధర్ గంగా డైరెక్షన్ లో విశ్వక్ హీరోగా మెరవనున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ తో విశ్వక్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు బంధూక్ అని టైటిల్ పరిశీలనలో ఉందట.