” కన్నప్ప ” హీరోగా మరొకరు అయ్యుంటే ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చేది.. విష్ణు షాకింగ్ కామెంట్స్..!

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ టీం మొత్తం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా విష్ణు.. నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ.. తన సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చిన్న విష్ణు.. ఇంట్ర‌వ్యూవర్ ప్రశ్నలన్నింటికీ కూల్ గా రియాక్ట్ అవుతూ వచ్చాడు. ఆయన చెప్పిన సమాధానాలు అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే యాంకర్.. విష్ణును, కన్నప్ప మూవీకి మీరు కాకుండా వేరే హీరో చేసి ఉంటే ఈపాటికి క్రేజ్ మరో లెవెల్ లో ఉండేదని నేను అంట.. దానికి మీరు ఏమంటారు.. అని ప్రశ్నించగా విష్ణు దానికి రియాక్ట్ అయిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Kannappa' new teaser: Vishnu Manchu's magnum opus promises stunning visual  spectacle with action-packed drama

సాధారణంగా ఈ ప్రశ్నకు ఎవరికైనా కోపం రావాలి. కానీ.. విష్ణు మాత్రం అవునండి మీరు చెప్పింది నిజమే.. నా ట్రాక్ రికార్డు చూస్తే ఎవరికైనా మంచి సినిమా నానుంచి వస్తుందని ఎలా నమ్ముతారు.. పైగా నా చివరి మూడు సినిమాలు ఫ్లాప్‌లు. కనుక.. ఇలాంటివన్నీ సహజమే అంటూ వివరించాడు. అప్పుడు యాంకర్ మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఈ సినిమాలో సాంగ్స్ నిజానికి చాలా బాగున్నాయి. రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాటైతే అద్భుతం. దానికి రావాల్సిన రేంజ్ లో రీచ్ రాలేదేమో.. కేవలం మీ సినిమా వల్లే ఇదంతా అనిపిస్తుంది.. ఆడియన్స్ కి మీరు అంటే చిన్న చూపు అనుకుంటున్నాను సార్ అని కామెంట్స్ చేశాడు. దానికి విష్ణు రియాక్ట్ అవుతూ.. ఏమో బహుశా నిదానంగా సాంగ్స్ కి మ‌రింత రీచ్ రావచ్చు.

Vishnu Manchu's Daughters in Kannappa: Is It a Family Project? - Bigtvlive  English

సినిమా రిలీజ్ అయ్యాక కూడా మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఈ పాట రీచ్ కాలేదనేది మీ అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ.. ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆపిల్ యాప్ లో ఇప్పటికీ టాప్ 7లో ఈ సాంగ్‌ కొనసాగుతుందంటూ వివరించాడు. ఈ సినిమాలో సాంగ్స్.. ఆడియో రైట్స్ ఎవ్వరికీ అమ్మలేదని విన్నాము నిజమేనా.. అని అడగగా.. విష్ణు దానిపై రియాక్ట్ అవులూ.. సాధారణంగా నా సినిమా ఆడియో రైట్స్ నేను ఎవ్వరికీ అమ్మను. కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేస్తా. నేను చివరిసారిగా ఆడియో రైట్స్ అమ్మిన సినిమా దేనికైనా రెడీ. అందులో పిల్ల అందం కేక.. అనే పాట కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చింది. అప్పుడే నేను పాటలు విలువ తెలుసుకున్నా. అప్పటినుంచి నా సినిమాకు సంబంధించిన ఏ ఆడియో రైట్స్ ని ఎవరికి నేను అమ్మడం లేదంటూ వివరించాడు. ప్రస్తుతం విష్ణు కూల్ గా రియాక్ట్ అయిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.