సాంబా మూవీ ఆ సీన్ అసలు తీయకుండా ఉండాల్సింది.. వి.వి. వినాయక్ షాకింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. భూమిక, ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన సినిమా కావడంతో సాంబా సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెల‌కొంది. ఇక సింహాద్రి త‌ర్వాత ఆంధ్రావాలా వచ్చి ఫ్లాప్ గా నిలిచినా.. ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే జెనీలియా, ప్రకాష్ రాజ్, విజయకుమార్, ఆలీ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలో నటించిన సాంబ మూవీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఇక ఈ సినిమాను ప్రతి ఒక్కరికి చదువు దక్కాలని గొప్ప కాన్సెప్ట్ తో రూపొందించారు. సాంబ మూవీలో ఎలివేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగా క్లిక్ అయ్యాయి. ప్రకాష్ రాజ్, కృష్ణ భగవాన్ మధ్య కామెడీ సీన్స్ ఆడియన్స్‌ను నవ్వించాయి.

V. V. Vinayak - Wikipedia

ఇలాంటి క్రమంలో ఆ మూవీ డైరెక్టర్ వి.వి. నాయక్ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. నా వరకు చెన్నకేశవరెడ్డి నేను తీసిన సినిమాల్లో బెస్ట్ సినిమా. అందులో స్క్రీన్ ప్లే చిన్న చిన్న లోపాలు ఉన్నా.. నాకు నా వర్క్ బాగా నచ్చింది. ఎక్కడ నేను ఫీల్ అవ్వలేదు. మేము సస్పెన్స్‌గా ఉందనుకుంటున్న పాయింట్ జనాలకు కన్ఫ్యూషన్ గా మారడం వల్ల అది సక్సెస్ అవ్వలేదేమో కానీ.. నేను తీయకూడదని అనుకున్న సీన్‌ మాత్రం సాంబ మూవీ లో ఒకటి ఉంది అంటూ వినాయక్‌ చెప్పుకొచ్చాడు. కెమెరా పెట్టి ఆ సీన్ తీసేసిన తర్వాత ఇది చెత్త సీను అని అభిప్రాయపడ్డానని.. అయితే తీసిన తర్వాత తీసేద్దాం అంటే షూటింగ్ ఆగిపోద్ది. దీంతో రకరకాల డిస్కషన్స్‌ తర్వాత.. సినిమాలో ఆ సీన్ అలాగే ఉంచి రిలీజ్ చేసామంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే ఆ చెత్త సీను తీసేసి ఉండాల్సిందే అని ఫీల్ అవుతానంటూ వినాయక్‌ వెల్లడించాడు. ఇంతకీ వినాయక్‌ అంతలా ఫీలయ్యే ఆ చెత్త సీన్‌ ఏంటి అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.

Watch Samba (Telugu) Full Movie Online | Sun NXT

దీనిపై నెటిజ‌న్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. సాంబ మూవీలో సొంత వదినను ప్రకాష్ రాజ్ తమ్ముడు.. రేప్ చేసేందుకు ప్రయత్నించే సీన్‌ ఒకటి ఉంటుంది. ఆ సీన్ గురించి డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడి ఉండవచ్చు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. త‌ర్వాత హీరో.. ప్రకాష్ రాజ్ తమ్ముడిని నరికేయడానికి ఈ సీనే కీలకం. వావివరసలు లేని కుక్క అనే డైలాగ్ కూడా ఈ సీన్‌లో ఉంటుంది. అక్కడ ఎమోషన్స్ కూడా బాగా పండించారు. ఈ నేపథ్యంలోనే మరికొందరు ఈ సీన్ గురించి అసలు వినాయక్‌ ఫీల్ అయ్యే అవకాశం లేదంటూ.. క్లైమాక్స్‌లో బాంబుని ఆర్పించేందుకు తన అక్క కొడుకుని టాయిలెట్ పోయమని చెప్తాడు హీరో.. ఆ సీన్ పై అప్పట్లో తేగ ట్రోలింగ్స్ వచ్చాయి. దాదాపు ఈ సీన్ గురించే వినాయక్ మాట్లాడే ఉంటాడు అంటూ.. ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.